...
...
Next Story

ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్త స్కీమ్ - త్వరలోనే ప్రకటన..! అమలు ఇలా

ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో కొత్త హెల్త్ స్కీమ్ రానుంది. ఇదే విషయంపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు కొత్త ఆరోగ్య పథకం అమలు చేస్తారు.

Published on: Feb 11, 2026, 12:01:21 IST
Advertisement

ప్రభుత్వ ఉద్యోగుల కోసం తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త ఆలోచన చేస్తోంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులకు త్వరలోనే కొత్త హెల్త్ స్కీమ్ ను అమలు చేయాలని భావిస్తోంది. ఇప్పటికే ప్రాథమికంగా కసరత్తు పూర్తి కాగా…. ఉద్యోగ సంఘాలతో చర్చించి నిర్ణయాన్ని ప్రకటించనుంది.

సీఎస్ నేతృత్వంలో కీలక భేటీ…!

ఉద్యోగులకు కొత్త స్కీమ్
ఉద్యోగులకు కొత్త స్కీమ్

ఫిబ్రవరి 12వ తేదీన(గురువారం) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో ఇతర ఉన్నతాధికారులతో పాటు పలు ఉద్యోగ సంఘాలు ఈ భేటీకి హాజరుకానున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న పథకంలో ఉన్న ఇబ్బందులను చర్చించి…. కొత్త పథకంలో తీసుకురావాల్సి మార్పులపై చర్చిస్తారు.

ప్రభుత్వ ఉద్యోగుల కోసం అమలు చేయబోయే ఈ పథకాన్ని ‘న్యూ ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్’గా వ్యవహరించే అవకాశం ఉంది. ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఎంప్లాయ్ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ (ఈహెచ్‌సీటీ) ఏర్పాటవుతుందని తెలుస్తోంది. అధికారిక ప్రకటనలో వీటిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగ హెల్త్ స్కీమ్ సేవలను రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అమలు చేస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు బకాయిలు సకాలంలో చెల్లించకపోవడంతో ఉద్యోగుల కార్డులు ఆసుపత్రుల్లో సరిగా చెల్లుబాటు కావడం లేదు. ఈ విషయంలో ఉద్యోగస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు. రీయింబర్స్‌మెంట్‌ కూడా ఆశించిన స్థాయిలో కావటం లేదు. ఈ విషయాలపై రాత పూర్వకంగా కూడా ఉద్యోగ సంఘాలు… ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. డీఏలు, పీఆర్సీ వంటి అంశాలతో పాటు హెల్త్ స్కీమ్ కూడా ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లలో ఒకటిగా ఉంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe