TG New Ration Cards : రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్ - ఇకపై మీసేవాలో అప్లయ్ చేసుకోవచ్చు, తాజా ప్రకటన ఇదే

తెలంగాణ రేషన్ కార్డు దరఖాస్తులపై కీలక అప్డేట్ వచ్చేసింది. నూతన రేషన్ కార్డుల కోసం మీసేవలో దరఖాస్తుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా పాత రేషన్ కార్డుల్లో మార్పులు,చేర్పులకు కూడా అవకాశం కల్పించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ వివరాలను పేర్కొంది. 

Published on: Feb 7, 2025, 19:35:29 IST
By , , తెలంగాణ, హైదరాబాద్
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నవారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు ఆఫ్ లైన్ లో దరఖాస్తులను స్వీకరించిన సంగతి తెలిసిందే. అయితే కొత్త రేషన్ కార్డుల కోసం మీసేవలో దరఖాస్తుకు కూడా వెసులుబాటు కల్పిస్తూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో కొత్త కార్డుల కోసం ఆన్ లైన్ లో అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది.

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు

మార్పులు చేర్పులకు అవకాశం…

మరోవైపు పాత రేషన్కార్డుల విషయంలోనూ పౌరసరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుల్లో మార్పులు,చేర్పులకు అవకాశం కల్పించింది. ఫలితంగా పేరు మార్పులే కాకుండా కొత్త సభ్యులను కూడా చేర్చుకునే వీలు ఉంటుంది.

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలే కొత్త రేషన్కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఎంపిక చేసిన కొన్ని గ్రామాల్లో కొత్త కార్డులను జారీ చేశారు. అయితే మిగతా చోట్ల వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా… ఇటీవలే గ్రామాల వారీగా ప్రాథమిక జాబితాలను ప్రకటించారు. వీటి కూడా అప్రూవల్ ఇచ్చి కార్డులను జారీ చేయనున్నారు.

నూతన రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం ప్రజాపాలన- గ్రామసభల ద్వారా దరఖాస్తులను స్వీకరించింది. ఇందులో భారీగా దరఖాస్తులు వచ్చాయి. కేవలం కొత్త కార్డుల కోసమే కాకుండా… కుటుంబ సభ్యుల పేర్లు చేర్చుకునేందుకు చాలా మంది ఇచ్చినవారిలో ఉన్నారు.

కేవలం ఆఫ్ లైన్ లోనే దరఖాస్తుల స్వీకరణ ఉండటంతో… ప్రజలకు ఇబ్బందిగా మారింది. గ్రామసభలు లేదా ప్రజాపాలన ప్రత్యేక కేంద్రాల్లో ఇచ్చేందుకు ప్రత్యేకంగా వెళ్లాల్సి వస్తోంది. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా… మీసేవా ద్వారా దరఖాస్తులను స్వీకరించేలా నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఇకపై కొత్త దరఖాస్తులు లేదా మార్పులు చేర్పుల కోసం మీసేవా కేంద్రాలను సంప్రదింవచ్చు.

ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో రేషన్కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి భారీ ఊరట లభించినట్లే అవుతుంది. నేరుగా మీసేవా కేంద్రాలకు వెళ్లి సులభంగా దరఖాస్తు చేసుకునే వీలు ఉంటుంది. మీసేవా కేంద్రాల నుంచి దరఖాస్తుల తీసుకునే ఆప్షన్ అందుబాటులోకి రావటంతో కొత్త దరఖాస్తులు భారీగానే వచ్చే అవకాశం ఉంటుంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More