Hyderabad Metro : ప్రభుత్వ పరమైన హైదరాబాద్ మెట్రో.. ఒప్పంద ప్రక్రియ పూర్తి
Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వ సొంతమైంది. ఎల్ అండ్ టీతో షేర్ల కొనుగోలు ఒప్పందం ప్రక్రియ పూర్తయ్యింది.
హైదరాబాద్ నగర రవాణా ముఖచిత్రాన్ని మార్చేసిన హైదరాబాద్ మెట్రో రైలు ప్రభుత్వ పరిధిలోకి వచ్చింది. గత కొంతకాలంగా సాగుతున్న చర్చలు, ప్రక్రియలు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చాయి. నిర్మాణ భాగస్వామి అయిన ఎల్ అండ్ టీ సంస్థ నుంచి మెట్రో వాటాలను కొనుగోలు చేసే ప్రక్రియ అధికారికంగా పూర్తయ్యింది.
రూ.1,461.47 కోట్ల విలువైన వంద శాతం షేర్ల బదిలీ అయింది. మార్చి 31ని మెట్రో స్వాధీన తేదీ అని మెుదటగా అనుకున్నారు. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణం మంజూరు ఆలస్యం కావడంతో గడువును ఏప్రిల్ 30కి పొడిగించిన విషయం తెలిసిందే.
ఒప్పందం వివరాలు
ఈ భారీ ఒప్పందంలో భాగంగా దాదాపు రూ.1,461.47 కోట్ల విలువైన వంద శాతం షేర్లను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీంతో ఇప్పటివరకు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిలో నడిచిన మెట్రో రైలు, ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రభుత్వ సంస్థగా అవతరించింది.
ఆలస్యానికి కారణం ఇదే
నిజానికి ఈ స్వాధీన ప్రక్రియను ఈ ఏడాది మార్చి 31 నాటికే పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఈ కొనుగోలుకు అవసరమైన నిధుల కోసం ప్రభుత్వం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) నుంచి రుణం కోరింది. ఆ రుణ మంజూరు ప్రక్రియలో సాంకేతిక కారణాల వల్ల కొంత ఆలస్యం కావడంతో, స్వాధీన గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించాల్సి వచ్చింది. తాజాగా నిధులు సమకూరడం, షేర్ల బదిలీ పత్రాలపై సంతకాలు పూర్తి కావడంతో ఈ బృహత్తర ప్రక్రియ ముగిసింది.
హెచ్‌ఎంఆర్‌ఎల్ ముఖ్య కార్యదర్శి, ఛైర్మన్ కె.రామకృష్ణ రావు, ఎల్ అండ్ టీ, ఎల్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్ సీనియర్ యాజమాన్యం సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. హెచ్‌ఎంఆర్‌ఎల్ తరఫున సర్ఫరాజ్ అహ్మద్, ఎల్ అండ్ టీ లిమిటెడ్ తరపున డి.కె.సేన్, ఎల్‌టీఎంఆర్‌హెచ్ఎల్ తరపున కె.వి.బి. రెడ్డి వాటా కొనుగోలు ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఎల్ అండ్ టీ మెట్రో రైల్(హైదరాబాద్)లిమిటెడ్, మూడు కారిడార్లలో మొత్తం 69 కిలోమీటర్ల నెట్‌వర్క్ పొడవుతో విస్తరించి ఉన్న హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-I ను నవంబర్ 2017 నుండి నిర్వహిస్తోంది. ఈ వ్యవస్థ ప్రస్తుతం రోజుకు సగటున సుమారు 4.5 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. ప్రారంభమైనప్పటి నుండి దాదాపు 86 కోట్ల ప్రయాణాలను నమోదు చేసింది.
ప్రయాణికులకు కలిగే ప్రయోజనం
మెట్రో ప్రభుత్వం చేతుల్లోకి రావడం వల్ల రానున్న రోజుల్లో టికెట్ ధరల నియంత్రణ, మెట్రో విస్తరణ పనులు, రాయితీల విషయంలో ప్రభుత్వం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం ఏ విధంగా చేపట్టబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


