...
...
Next Story

గ్రామ పంచాయతీ ఎన్నికలు : మొదటి రోజు 5,063 నామినేషన్లు దాఖలు - అత్యధికంగా ఎక్కడంటే..?

రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. తొలిరోజు సర్పంచ్ స్థానాలకు 3,242, వార్డు స్థానాలకు 1,821 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి విడతలో 4,236 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి.

Published on: Nov 28, 2025, 09:54:47 IST
Advertisement

రాష్ట్రంలో మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి రోజు 5,063 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో సర్పంచి స్థానాలకు 3,242, వార్డు పదవులకు 1,821 నామినేషన్లను సమర్పించారు.

ఈనెల 29 వరకు నామినేషన్లు…

గ్రామ పంచాయతీ ఎన్నికలు - కొనసాగుతున్న నామినేషన్లు
గ్రామ పంచాయతీ ఎన్నికలు - కొనసాగుతున్న నామినేషన్లు

మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నవంబర్ 29వ తేదీ వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. నవంబర్ 30వ తేదీ నామినేషన్ పత్రాల పరిశీలన ఉంటుంది. వీటిపై డిసెంబరు 1న వినతులను స్వీకరిస్తారు. డిసెంబర్ 2వ తేదీన ఆయా దరఖాస్తులను పరిష్కరిస్తారు. డిసెంబర్ 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు ఛాన్స్ ఉంటుంది. అదే రోజు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు.

నామినేషన్లు వేసే అభ్యర్థులు కొత్త బ్యాంక్ అకౌంట్లు తీస్తున్నారు. దీంతో బ్యాంకుల వద్ద సందడి వాతావరణం కనిపిస్తోంది. ఎన్నికల వ్యయ పరిశీలన కోసం అభ్యర్థులకు కొత్త బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి. అంతేకాకుండా నామినేషన్ పత్రాల్లో తప్పులు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. మరోవైపు గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద కూడా సందడి వాతావరణం ఉంది.

జిల్లాల వారీగా….

తొలి విడత నామినేషన్లకు శనివారం చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నల్గొండ జిల్లాలో 318 సర్పంచ్‌‌‌‌ స్థానాలకు అత్యధికంగా 421 నామినేషన్లు దాఖలయ్యాయి. యాదాద్రి జిల్లాలో 153 స్థానాలకు 209, సూర్యాపేట జిల్లాలో 159 స్థానాలకు 207, వరంగల్‌‌‌‌లో 91 స్థానాలకు 101 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక సంగారెడ్డి జిల్లాలోని 136 స్థానాలకు 147 నామినేషన్ల సమర్పించగా… జనగామ జిల్లాలో 110 స్థానాలకు 108 నామినేషన్లు దాఖలు చేశారు.

ఈసీ ప్రత్యేక యాప్…

ఓటర్లు తమ ఓటరు స్లిప్ మరియు పోలింగ్ స్టేషన్ వివరాలను డౌన్ లోడ్ చేసుకునే వీలుంటుంది. యాప్ ఉపయోగించి ఫిర్యాదులను అప్ లోడ్ చేసుకోవచ్చని ఎన్నికల సంఘం ఓ ప్రకటన ద్వారా తెలిపింది.

' టీ-పోల్ మొబైల్ యాప్'ను ప్లేస్టోర్లో అందుబాటులో ఉందని ఒక ప్రకటనలో తెలిపింది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను కమిషన్ నవంబర్ 25న ప్రకటించిన సంగతి తెలిసిందే.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe