TG HC Recruitment : హైకోర్టులో డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - మంచి జీతం, ఇవిగో వివరాలు..!

తెలంగాణ హైకోర్టు నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా 9 డ్రైవర్ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు.

Published on: Feb 4, 2026, 12:53:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ హైకోర్టు నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా 9 ఖాళీలను భర్తీ చేస్తారు. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 7వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు ఫిబ్రవరి 28వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఈ పోస్టులన్నీ కూడా ఓపెన్ కేటగిరిలోనే భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

తెలంగాణ హైకోర్టు
తెలంగాణ హైకోర్టు

డ్రైవర్ పోస్టుల నోటిఫికేషన్ - ముఖ్య వివరాలు:

  • ఉద్యోగ నోటిఫికేషన్ - హైకోర్టు, తెలంగాణ రాష్ట్రం
  • ఉద్యోగాలు - డ్రైవర్
  • ఖాళీలు - 09
  • పదో తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. తెలుగు చదవం, రాయటం వచ్చి ఉండాలి.
  • 2026 జులై 1వ తేదీ నాటికి 46 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీకి 5 ఏళ్లు, పీహెచ్‌ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
  • దరఖాస్తు విధానం - ఆన్ లైన్
  • దరఖాస్తు ఫీజు కింద రూ.500 చెల్లించాలి.
  • దరఖాస్తులు ప్రారంభం - 7 ఫిబ్రవరి 2026
  • దరఖాస్తులకు చివరి తేదీ - 28 ఫిబ్రవరి 2026
  • జీతం - రూ.22,900 - రూ.69,150.
  • స్కిల్ టెస్ట్‌ ఆధారంగా రిక్రూట్ మెంట్ చేస్తారు. ఇందులో మెరిట్ సాధించిన అభ్యర్థులను గుర్తిస్తారు.
  • అధికారిక వెబ్ సైట్ - https://tshc.gov.in/s

ఈ లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ పీడీఎఫ్ చూడొచ్చు

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More