...
...
Next Story

గ్రామ పంచాయతీ ఎన్నికలు - ‘స్టే’ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ

పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల కోసం జారీ చేసిన 46 జీవోపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎన్నికల ప్రక్రియ మొదలైన నేపథ్యంలో స్టే విధించలేమని స్పష్టం చేసింది.తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది

Published on: Nov 28, 2025, 12:32:32 IST
Advertisement

పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు రాష్ట్ర హైకోర్టు నిరాకరించింది. రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 46పై అభ్యంతరంపై వ్యక్తం చేస్తూ పలు బీసీ సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. అత్యంత వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు కేటాయించాలని పిటిషన్ లో ప్రస్తావించాయి. దీనిపై విచారించిన హైకోర్టు…. ప్రస్తుత దశలో స్టే విధించలేమని స్పష్టం చేసింది.

ఈ దశలో స్టే ఇవ్వలేం….

తెలంగాణ హైకోర్టు
తెలంగాణ హైకోర్టు

ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ మొదలైందని… ఇలాంటి దశలో స్టే ఇవ్వలేమని ధర్మాసనం పేర్కొంది. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యాక ఎందుకు సవాల్‌ చేస్తున్నారని ప్రశ్నించింది. ఇరువైపు వాదనలు విన్న కోర్టు…. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను 8 వారాలకు వాయిదా వేసింది.

పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 22వ తేదీన జీవో 46ను జారీ చేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.జనాభా గణాంకాలు లేకుండా రిజర్వేషన్లు కేటాయించారని…. ఏ ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కేటాయించరన్నదానిపై స్పష్టత లేదని పేర్కొన్నారు.

బీసీ జనాభాకు సంబంధించి ప్రత్యేక కమిషన్‌ సమర్పించిన వివరాలను వెల్లడించలేదని పిటిషన్ లో ప్రస్తావించారు. బీసీల్లో ఏ, బీ, సీ, డీ వర్గీకరణ చేపట్టకపోవడంతో రిజర్వేషన్లు తగ్గాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జీవో 46 అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ పై గురువారం విచారించిన కోర్టు… శుక్రవారం కూడా వాదనలు వినింది. ఇరువైపు వాదనలు విన్న తర్వాత…స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.

ఉన్నత న్యాయస్థానం స్టే ఇవ్వకపోవటంతో…. ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందుకు సాగనున్నాయి. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన తేదీల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… డిసెంబర్ 11,14, 17 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం మొదటి విడత నామినేషన్లు కొనసాగుతున్నాయి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks