హైకోర్టులో ముగిసిన వాదనలు - గ్రూప్-1పై జనవరి 22న తీర్పు
తెలంగాణ హైకోర్టులో గ్రూప్-1పై వాదనలు ముగిశాయి. జనవరి 22వ తేదీన న్యాయస్థానం తుది తీర్పును వెలువరించనుంది. ఈ తీర్పుపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.
గ్రూప్-1 పరీక్షల ఫలితాలపై తెలంగాణ హైకోర్టులో మంగళవారం వాదనలు ముగిశాయి. పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం తదితరాలకు సంబంధించిన వివాదంపై జనవరి 22న తీర్పు వెలువరించనుంది. గతంలో సెలక్షన్ లిస్ట్‌ను రద్దు చేస్తూ సింగల్ బెంచ్ తీర్పునివ్వగా… డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది. ఇరువైపు వాదనలు పూర్తి కాగా… జనవరి 22వ తేదీన తుది తీర్పును ప్రకటించనుంది.

ఇరువైపు వాదనలు పూర్తి…
నిబంధనల మేరకే గ్రూప్-1 పరీక్ష జరిగిందని TGPSC తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. పరీక్ష నిర్వహణ తప్పుల తడక జరిగిందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు. మరోవైపు ఉద్యోగాలు పొందిన పలువురు అభ్యర్థులు కూడా అప్పీల్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం సుదీర్ఘ విచారణ చేపట్టింది.
అభ్యర్థులు తరపున వాదనలు వినిపించిన న్యాయవాదులు… నోటిఫికేషన్ జారీలోని తప్పులను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అదనంగా వచ్చిన పోస్టులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశం లేకపోయినా 563 కలిపి ఒకే నోటిఫికేషన్ జారీ చేసిందని గుర్తు చేశారు. ప్రిలిమ్స్‌కు, మెయిన్స్‌కు వేర్వేరుగా హాల్‌టికెట్ నంబర్లు కేటాయించారని…. ఇది నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. మూల్యాంకన ప్రక్రియ కూడా పారదర్శకంగా నిర్వహించలేదని వాదించారు.
ఇక కమిషన్ తరపు న్యాయవాదులు వాదనల వినిపిస్తూ…. నిబంధనల ప్రకారమే పరీక్షల నిర్వహణ జరిగిందన్నారు. మూల్యాంకన ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని వాదించారు.పరీక్షల్లో అర్హత సాధించలేనివారే కోర్టును ఆశ్రయించారని గుర్తు చేశారు. ఇరువైపుల సుదీర్ఘ వాదనలు విన్న న్యాయస్థానం… తుది తీర్పును జనవరి 22న వెలువరించనుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందనేది ఉత్కంఠ నెలకొంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

