టీజీ ఐసెట్ - 2026 కౌన్సెలింగ్ అప్డేట్... వెబ్ ఆప్షన్లు ప్రారంభం, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే..?

Telangana ICET Counselling 2026 : తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల టీజీ ఐసెట్ కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్లు షురూ అయ్యాయి. ఆగస్టు 8 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు.  

Published on: Aug 4, 2026, 06:52:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Telangana ICET Counselling 2026 : రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో ఎంబీఏ (MBA), ఎంసీఏ (MCA) కోర్సుల్లో చేరేందుకు ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. టీజీ ఐసెట్ - 2026 కౌన్సెలింగ్ ప్రక్రియలో అత్యంత కీలకమైన వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది.

టీజీ ఐసెట్ వెబ్ ఆప్షన్లు 2026
టీజీ ఐసెట్ వెబ్ ఆప్షన్లు 2026

ఇప్పటికే కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు మొదలు కావడంతో… అధికారులు తాజాగా వెబ్ ఆప్షన్ల లింక్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఐసెట్ కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్న అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 8వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో తమకు నచ్చిన కళాశాలలు, కోర్సులను ఎంచుకోవడానికి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.

ఈనెల 8 వరకు ఛాన్స్…

విడుదల చేసిన ప్రవేశాల షెడ్యూల్ ప్రకారం…. ప్రాథమికంగా నమోదు చేసుకున్న విద్యార్థులకు ఆగస్టు 5వ తేదీ వరకు నిర్దేశిత హెల్ప్‌లైన్ కేంద్రాల్లోధ్రువపత్రాల పరిశీలన చేపడతారు. ఈ సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన అభ్యర్థులు మాత్రమే వెబ్ ఆప్షన్లు పెట్టుకోవడానికి అర్హత సాధిస్తారు. విద్యార్థులు ఆగస్టు 8వ తేదీ వరకు తమ ప్రాధాన్యతలను లాక్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించారు.

అభ్యర్థులు నమోదు చేసుకున్న వెబ్ ఆప్షన్లు, మెరిట్ మరియు రిజర్వేషన్ల ఆధారంగా ఆగస్టు 11వ తేదీన లేదా అంతకంటే ముందే మొదటి విడత సీట్ల కేటాయింపు ఫలితాలను అధికారులు వెల్లడిస్తారు. తొలి విడత కౌన్సెలింగ్‌లో సీటు పొందిన అభ్యర్థులు ఆగస్టు 11 నుంచి 14వ తేదీ మధ్య ఆన్‌లైన్ విధానంలో నిర్దేశిత ట్యూషన్ ఫీజు చెల్లించి, ఆన్‌లైన్ సెల్ఫ్‌ రిపోర్టింగ్ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. నిర్ణీత సమయంలోగా ఫీజు చెల్లించని వారి సీటు రద్దయ్యే అవకాశం ఉంది.

టీజీ ఐసెట్ కౌన్సెలింగ్ - వెబ్ ఆప్షన్ల నమోదు ఇలా…

  • మొదటగా తెలంగాణ ఐసెట్ అధికారిక వెబ్‌సైట్ https://tgicet.nic.in/default.aspx ను సందర్శించాలి.
  • హోం పేజీలో కనిపించే 'Candidate Login' ఆప్షన్‌పై క్లిక్ చేసి, మీ రిజిస్ట్రేషన్ నంబర్, ఐసెట్ హాల్ టికెట్ నంబర్, పాస్‌వర్డ్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
  • లాగిన్ అయిన తర్వాత తెరపై కనిపించే కాలేజీల జాబితా ఆధారంగా మీకు ఇష్టమైన కోర్సులు, కళాశాలల ప్రాధాన్యతలను ఎంచుకోవాలి.
  • మీరు ఎంచుకున్న ప్రాధాన్యతలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకుని, చివరగా సేవ్ లేదా సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేస్తే వెబ్ ఆప్షన్ల ప్రక్రియ పూర్తవుతుంది.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More