TG Inter Supplementary Exams 2026 : రేపట్నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు - విద్యార్థులకు కీలక సూచనలివే!

Telangana Inter Supplementary Exams 2026: తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు (IPASE) మే 13 నుంచి 21 వరకు జరగనున్నాయి. మొత్తం 3.98 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్న ఈ పరీక్షల కోసం బోర్డు పటిష్ట ఏర్పాట్లు చేసింది.

Published on: May 12, 2026, 19:23:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Telangana Inter Supplementary Exams 2026: తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు అంతా సిద్ధమైంది. మే 13 నుంచి జరిగే ఈ పరీక్షల కోసం…. ఇంటర్ బోర్డు ఏర్పాట్లను పూర్తి చేసింది. జనరల్, ఒకేషనల్ విభాగాలకు చెందిన మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులకు మే 21 వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 889 పరీక్షా కేంద్రాలను బోర్డు ఏర్పాటు చేసింది.

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు 2026
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు 2026

ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు, రెండో సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.

విద్యార్థులు పరీక్షా సమయానికి గంట ముందే (మొదటి సంవత్సరం వారు ఉదయం 8:00 కి, రెండో సంవత్సరం వారు మధ్యాహ్నం 1:30 కి) కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. ఈ పరీక్షల కోసం మొత్తం 3,98,358 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. ఇందులో మొదటి సంవత్సరం - 2,67,285 మంది విద్యార్థులు. రెండో సంవత్సరం - 1,31,073 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 10,685 మంది ఇన్విజిలేటర్లు, 75 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ పరీక్షల పర్యవేక్షణలో పాల్గొంటారు.

ముఖ్యమైన సూచనలు:

  • విద్యార్థులు కాలేజీ లాగిన్ ద్వారా లేదా అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • ప్రిన్సిపాల్ సంతకం లేకపోయినా డౌన్‌లోడ్ చేసిన హాల్ టికెట్‌తో పరీక్షకు అనుమతిస్తారు.
  • సెల్ ఫోన్లు, కాలిక్యులేటర్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా హాల్లోకి అనుమతించరు.
  • మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని బోర్డు హెచ్చరించింది.
  • పరీక్షా కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీరు, వైద్య సహాయం (నర్సు/ANM) అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.
  • నిఘా కోసం ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
  • పరీక్షల సమయంలో ఒత్తిడికి గురయ్యే విద్యార్థుల కోసం 'టెలీ-మానస్' (Tele-MANAS) సేవలు అందుబాటులో ఉన్నాయి. సహాయం కోసం 14416 అనే టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చు.

పరీక్షల షెడ్యూల్ వివరాలు

  • మే 13: సెకండ్ లాంగ్వేజ్ (పేపర్-I & II)
  • మే 14: ఇంగ్లీష్ (పేపర్-I అండ్ II)
  • మే 15: మ్యాథ్స్-1ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ / మ్యాథ్స్-2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్
  • మే 16: మ్యాథ్స్-1B, జువాలజీ, హిస్టరీ / మ్యాథ్స్-2B, జువాలజీ, హిస్టరీ
  • మే 18: ఫిజిక్స్, ఎకనామిక్స్ (పేపర్-I & II)
  • మే 19: కెమిస్ట్రీ, కామర్స్ (పేపర్-I & II)
  • మే 20: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ (BiPC విద్యార్థులకు)
  • మే 21: మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ (పేపర్-I & II)
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More