తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్.. ఎలా చెక్ చేసుకోవాలి?
TG Intermediate Supplementary Results 2026 : తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. మీకోసం ఇక్కడ డైరెక్ట్ లింక్ అందించాం చూసుకోండి.
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది. తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE) తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ (IPASE) పరీక్షల ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. జనరల్, వొకేషనల్ కోర్సుల విద్యార్థుల మార్కుల మెమోలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

ఈ ఏడాది మే 13 నుంచి మే 21 వరకు నిర్వహించిన సప్లిమెంటరీ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ వేగంగా పూర్తి చేసి, సకాలంలో ఫలితాలను బోర్డు ప్రకటించింది. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ఉపయోగించి స్కోరు కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫలితాల విడుదల నేపథ్యంలో ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఎలాంటి ఆటంకం లేకుండా విద్యార్థులు తదుపరి అడ్మిషన్ల ప్రక్రియకు సిద్ధం కావచ్చని అధికారులు తెలిపారు.
ఫలితాలు ఎక్కడ చూసుకోవాలి?
విద్యార్థులు కింది అధికారిక వెబ్‌సైట్ల ద్వారా తమ మార్కుల మెమోను సులువుగా చెక్ చేసుకోవచ్చు
రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి?
అధికారిక వెబ్‌సైట్ tgbie.cgg.gov.in, results.cgg.gov.in ఓపెన్ చేయండి
IPE/IPASE Mark's Memos Results లింక్ మీద క్లిక్ చేయండి.
తర్వాత IPASE - 2026 RESULTS మీద క్లిక్ చేయాలి.
ఆ తర్వాత ఒక విండో ఓపెన్ అవుతుంది. అందులో మీ గ్రూప్ ఎంచుకుని హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి.
వివరాలు ఇచ్చి సబ్‌మిట్ చేయగానే మీ రిజల్ట్స్ స్క్రీన్‌పై కనిపిస్తాయి. మార్కులను సరిచూసుకుని, భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్‌అవుట్ లేదా పీడీఎఫ్ ఫైల్ సేవ్ చేసుకోండి.
ఈ లింక్ క్లిక్ చేసి ఫలితాలను నేరుగా చూసుకోవచ్చు.
వెబ్‌సైట్లలో ఆన్‌లైన్ మార్కుల మెమో తాత్కాలికం మాత్రమే. విద్యార్థులు తమ ఒరిజినల్ మార్కుల జాబితాను కొన్ని రోజుల్లో తమ తమ కళాశాలల నుంచి పొందేలా బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఏదైనా సాంకేతిక సమస్యల వల్ల వెబ్‌సైట్ ఓపెన్ కాకపోతే కాసేపు ఆగి మళ్లీ ప్రయత్నించాలని అధికారులు సూచించారు. ఈ మేరకు మీ ఫలితాలు చూసుకోవచ్చు.
మొత్తం 889 పరీక్షా కేంద్రాలలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర (జనరల్ + వొకేషనల్) పరీక్షలకు 3,98,459 మంది విద్యార్థులు హాజరయ్యారు. అలాగే 17 స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాలలో సమాధాన పత్రాల మూల్యాంకనం చేశారు. ప్రాక్టికల్ పరీక్షలు 22-05-2026 నుండి 25-05-2026 వరకు 33 పరీక్షా కేంద్రాలలో నిర్వహించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


