తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు. ఆనెను నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు పోలీసులు తరలించారు. సింగరేణి సంస్థలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించడం, మెడికల్ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్‌తో నాంపల్లిలోని సింగరేణి భవన్‌ను కవితతోపాటుగా ఆ సంస్థ నేతలు ముట్టడించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అంతకుముందు కల్వకుంట్ల కవిత అక్కడకు ఆటోలో వచ్చారు. నాంపల్లిలోని సంగరేణి భవన్‌ను కవిత, జాగృతి నేతలు, హెచ్ఎంఎస్ నాయకులు ముట్టడించే ప్రయత్నం చేయగా దీంతో అక్కడ కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరువైపులా తోపులాట జరిగింది. స్థానికంగా ఉద్రిక్త వాతావరణంతో పరిస్థితి అదుపు తప్పేలా కనిపించింది. దీంతో కవితతోపాటుగా మరికొందరి నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
తెలంగాణలోని బొగ్గు బ్లాకుల వేలాన్ని వెంటనే నిలిపివేయాలని కవిత డిమాండ్ చేశారు. కొత్త బ్లాకులను సింగరేణికి మాత్రమే కేటాయించాలని చెప్పారు. 'సింగరేణి పరిధిలో ప్రతీ కాంట్రాక్ట్‌లో 25 శాతం అవినీతి జరుగుతోంది. అందులో 10 శాతం వాటా కాంగ్రెస్ నాయకులు వెళ్తోంది. అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం స్పందించకపోతే సీబీఐకి ఫిర్యాదు చేస్తాం. సింగరేణి కార్మికుల జీతాల నుంచి ఆదాయపు పన్ను వసూళ్లు నిలిపివేయలి. దీనితో కార్మికులపై ఆర్థిక భారం తగ్గుతుంది.' అని కవిత అన్నారు.
మెడికల్ బోర్డు కార్మికుల ఆరోగ్యానికి అత్యవసరం అని కవిత అన్నారు. రెండేళ్లుగా తాము పోరాటం చేస్తున్నామని చెప్పారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వడం లేదని, ఉన్న డిపెండెంట్ ఉద్యోగాలు తీసివేయడం సరికాదన్నారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కారం చేయకపోతే.. పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
బీఆర్ఎస్ నుంచి కవిత బయటకు వచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలిగా జనం బాట కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇందులో భాగంగానే సత్తపల్లిలోని సింగరేణి ఉపరితల బొగ్గు గనులను సందర్శించారు. ఈ సంస్థలో డిపెండెంట్ ఉద్యోగాలను కాపాడుకోలేని పరిస్థితిలో ఉందని చెప్పారు. సింగరేణిలోని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని, వేజ్ బోర్డు ప్రకారం వేతను అందజేయాలని కవిత డిమాండ్ చేశారు. సింగరేణి సూపర్ స్పెషాలిటీ వైద్యశాల, కార్మికుల పిల్లలకు పాఠశాలలను ఏర్పాటు చేయాలన్నారు.
{{/usCountry}}బీఆర్ఎస్ నుంచి కవిత బయటకు వచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలిగా జనం బాట కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇందులో భాగంగానే సత్తపల్లిలోని సింగరేణి ఉపరితల బొగ్గు గనులను సందర్శించారు. ఈ సంస్థలో డిపెండెంట్ ఉద్యోగాలను కాపాడుకోలేని పరిస్థితిలో ఉందని చెప్పారు. సింగరేణిలోని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని, వేజ్ బోర్డు ప్రకారం వేతను అందజేయాలని కవిత డిమాండ్ చేశారు. సింగరేణి సూపర్ స్పెషాలిటీ వైద్యశాల, కార్మికుల పిల్లలకు పాఠశాలలను ఏర్పాటు చేయాలన్నారు.
{{/usCountry}}