...
...
Next Story

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం - మహబూబాబాద్‌ జిల్లా వాసి మృతి, స్వగ్రామంలో తీవ్ర విషాదం!

అమెరికాలోని మిస్సోరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన దారం సుప్రియ (31) మృతి చెందారు. ట్రక్కు వెనుక నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

Published on: Oct 5, 2026, 14:04:33 IST
Advertisement

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్‌ జిల్లా వాసి మృతి చెందారు. ఉద్యోగం ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో జరిగిన ప్రమాదంలో దారం సుప్రియ (31) అక్కడికక్కడే కన్నుమూశారు. ఈ విషాద ఘటనతో ఆమె స్వగ్రామంలోని తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

దారంతోటి సుప్రియ (31)
దారంతోటి సుప్రియ (31)

ప్రాథమిక సమాచారం ప్రకారం.... మహబూబాబాద్ జిల్లా మర్రిపెడ మండలానికి చెందిన దారం సుప్రియ (31) అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలో నివాసముంటున్నారు. స్థానిక సెయింట్ లూయిస్‌లోని ఒక రెస్టారెంట్‌లో ఉద్యోగం చేస్తున్న ఆమె…. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పనులు ముగించుకుని తన స్నేహితురాలితో కలిసి కారులో ఇంటికి తిరుగుపయనమయ్యారు.

సరిగ్గా ఆదివారం వేకువజామున 2:20 గంటల సమయంలో వీరు ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి వచ్చిన ఒక వేగవంతమైన ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ఈ భయానక ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సుప్రియ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఆమెతో పాటు కారులో ప్రయాణిస్తున్న సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన మరో తెలుగు యువతికి తీవ్ర గాయాలయ్యాయి.

స్థానికులు వెంటనే స్పందించి సమాచారం అందించడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న అత్యవసర వైద్య సిబ్బంది, గాయపడిన యువతిని సమీప ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

మృతురాలు సుప్రియకు ఐదేళ్ల క్రితం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌‌గా పనిచేస్తున్న కొడుమూరి రంజిత్‌తో వివాహమైంది. ఉద్యోగ రీత్యా కొన్నేళ్లుగా మిస్సోరీలోనే స్థిరపడిన ఈ దంపతులకు రెండున్నరేళ్ల బాబు ఉన్నాడు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన చిన్నారితో సంతోషంగా సాగుతున్న వారి జీవితంలో ఈ ప్రమాదం తీరని శోకాన్ని మిగిల్చింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks