రూ. 10 నాణేలతో రూ. 1.23 లక్షల పొదుపు - హోండా యాక్టివా కొన్న మంచిర్యాల వాసి..! కల తీరిందంటూ...
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటకు చెందిన బి. రవి జోసెఫ్ మూడేళ్ల పాటు ప్రతిరోజూ దాచిన రూ. 10 నాణేలతో రూ. 1.23 లక్షల విలువైన హోండా యాక్టివా స్కూటర్ కొనుగోలు చేశాడు. ఒక్కో రూపాయి పొదుపు చేసి తన కలను నిజం చేసుకోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండల కేంద్రానికి చెందిన 51 ఏళ్ల బి. రవి జోసెఫ్ స్థానికంగా చర్చి పాస్టర్‌గా సేవలందిస్తున్నారు. ప్రతి సాధారణ మధ్యతరగతి వ్యక్తిలాగే ఆయనకూ ఒక కొత్త ద్విచక్ర వాహనం కొనుగోలు చేయాలనేది కల.! అయితే, దాని కోసం బ్యాంకు లోన్లపై ఆధారపడకుండా, తన దైనందిన ఖర్చుల నుంచే పొదుపు మార్గాన్ని ఎంచుకున్నారు.

అక్టోబర్ 10, 2023 నుంచి పొదుపు ప్రయాణం
రవి జోసెఫ్ 2023 అక్టోబర్ 10న తన ప్రత్యేక పొదుపు ప్రయాణాన్ని ప్రారంభించాడు. నిత్యం కిరాణా సరుకులు, రోజువారీ అవసరాల కోసం బయటకు వెళ్లినప్పుడు చిల్లరగా వచ్చే ప్రతి రూ. 10 నాణేన్ని పక్కన పెట్టడం అలవాటు చేసుకున్నాడు.
"గడిచిన మూడేళ్లుగా నా రోజువారీ ఖర్చులు, నిత్యావసర సరుకులు కొనేటప్పుడు వచ్చిన ప్రతి 10 రూపాయిల నాణేన్ని దాచిపెట్టాను. ఎక్కడికి వెళ్లినా చిల్లర రూపంలో వచ్చే నాణేలను జాగ్రత్తగా దాచడం వల్ల కొద్దికొద్దిగా మొత్తం రూ. 1,23,000 కూడబెట్టగలిగాను" అని రవి జోసెఫ్ తెలిపారు.
రవి జోసెఫ్‌కు రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్ కొనాలనే బలమైన కోరిక ఉండేది. కానీ ఆర్థిక పరిమితుల దృష్ట్యా ఆ ఆలోచనను విరమించుకోవాల్సి వచ్చిందని ఆయన కొంత విచారం వ్యక్తం చేశారు. మొదట్లో ఈ పొదుపు మొత్తంతో ఇంటికి ఉపయోగపడే వస్తువులు ఏదైనా కొనాలని భావించినప్పటికీ…. చివరికి కుటుంబ అవసరాల కోసం ఒక మంచి ద్విచక్ర వాహనం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఈ మూడేళ్ల పొదుపు ప్రయాణం అంత సులభంగా ఏమీ సాగలేదు. సమాజంలో రూ. 10 నాణేలు చెల్లవని, ప్రభుత్వం వాటిని రద్దు చేయబోతోందంటూ రకరకాల పుకార్లు వ్యాపించాయి. దీంతో రవి జోసెఫ్ కుటుంబ సభ్యులు కూడా నాణేలు దాచడం వద్దని, ఈ అలవాటును మానుకోవాలని ఆయనకు సూచించారు. అయినప్పటికీ ఆయన అధైర్యపడకుండా…. ప్రతి లావాదేవీలో వచ్చే నాణేలను సేకరిస్తూనే ఉన్నారు.
షోరూమ్‌లో 2 గంటల పాటు నాణేల లెక్కింపు
తను దాచిన నాణేలన్నింటినీ తీసుకుని లక్షెట్టిపేటలోని ‘జగదాంబ హోండా మోటార్స్’ షోరూమ్‌కు రవి జోసెఫ్ తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. మూడేళ్ల శ్రమతో కూడబెట్టిన నాణేల బస్తాలను చూసి షోరూమ్ సిబ్బంది తొలుత ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత సిబ్బంది దాదాపు 2 గంటల పాటు శ్రమించి ఆ నాణేలను లెక్కించారు. మొత్తం రూ. 1.23 లక్షల విలువైన 10 రూపాయల నాణేలు ఉన్నట్లు ధృవీకరించి…. వాహనానికి సంబంధించిన పేపర్లు పూర్తి పేపర్లను పూర్తి చేసి… జోసెఫ్‌కు సరికొత్త హోండా యాక్టివా తాళాలను అందించారు.
చిల్లర నాణేలతో బైక్ కొనుగోలు చేసిన ఈ వినూత్న ఘటన స్థానికంగానూ, షోరూమ్ ప్రాంగణంలోనూ తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. మూడేళ్ల పట్టుదల, క్రమశిక్షణతో కూడిన పొదుపుతో తన కలను నిజం చేసుకున్న రవి జోసెఫ్‌ను స్థానికులు అభినందిస్తున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

