మున్సిపల్ ఎన్నికలు : ఆసక్తికరంగా కరీంనగర్ పాలిటిక్స్ - మేయర్ పీఠంపై బీజేపీ ధీమా..! పావులు కదుపుతున్న కాంగ్రెస్

కరీంనగర్ లో మేయర్ పదవి బీజేపీకి చిక్కబోతుంది. కార్పొరేషన్‌లో అధికారం చేపట్టడానికి 35 మంది సభ్యుల ఓట్లు అవసరం కాగా… ఆ మార్కును దాటింది. 30 డివిజన్లలో బీజేపీ విజయం సాధించగా… మరో నలుగురి మద్దతును కూడగట్టింది.

Published on: Feb 15, 2026 6:33 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించినప్పటికీ… మేయర్ పీఠాన్ని దక్కించుకోవటానికి కావాల్సిన ఫిగర్ రాలేదు. దీంతో స్వతంత్రులతో పాటు ఫార్వర్డ్‌బ్లాక్‌ సభ్యు రాలిని తమవైపు తిప్పుకోగలింది. ఫలితంగా కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీ ఖాతాలోకి వెళ్లనుంది.

బీజేపీ చేతికి కరీంనగర్ మేయర్
బీజేపీ చేతికి కరీంనగర్ మేయర్

బీజేపీకి లైన్ క్లియర్…!

కార్పొరేషన్‌ పరిధిలోని 66 డివిజన్లు ఉన్నాయి. 30 డివిజన్లలో బీజేపీ విజయం సాధించి…. అత్యధిక స్థానాలను సాధించిన పార్టీగా నిలిచింది. మేయర్ పీఠం దక్కించుకోవటానికి 35 మంది సభ్యుల ఓట్లు అవసరం ఉంటుంది. వారు గెలుచుకున్న 30 మంది కార్పొరేటర్లకు తోడు ఒక ఫార్వర్డ్‌బ్లాక్‌ సభ్యు రాలు సాయిజ్యోతితో పాటు నలుగురు స్వతంత్రుల మద్దతును కూడగట్టింది.

కండువా కప్పి వీరిని కేంద్రమంత్రి బండి సంజయ్ పార్టీలోకి ఆహ్వానించారు. ఫలితంగా బీజేపీ బలం 34కు చేరుకుంటుంది. ఎక్స్‌ ఆఫిషియో సభ్యుడిగా ఉన్న కేంద్రమంత్రి, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ ఓటుతో కలుపుకొని మ్యాజిక్‌ ఫిగర్‌ 35 సాధించినట్లయింది.ఈనెల 16న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. దాదాపుగా తమకు ఈ పీఠాలు దక్కుతాయని బీజేపీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో క్యాంపు కూడా వేశారు.

మరోవైపు కాంగ్రెస్ కూాడా కరీంనగర్ పీఠంపై ఆశలు పెట్టుకుంటోంది. బీఆర్ఎస్, ఎంఐఎంతో పాటు ఇండిపెండెంట్ల మద్దతుతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశాలపై కసరత్తు చేస్తోంది. మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ… ఎంత వరకు ఫలిస్తాయనేది చూడాలి.

నిజామాబాద్ లో సీన్ రివర్స్..!

నిజామాబాద్ లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రతిపక్షంలో కూర్చోవాలని నిర్ణయించింది. నిజామాబాద్ లోని 60 వార్డుల్లో బీజేపీ 28, కాంగ్రెస్ 17, ఎంఐఎం 14, బీఆర్ఎస్ 1 వార్డులు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ , ఎంఐఎం కలిసి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది.

కొత్తగూడెంలో అధికార కాంగ్రెస్, సీపీఐ సమాన సంఖ్యలో వార్డులను కైవసం చేసుకోవడంతో కొత్తగూడెం కార్పొరేషన్ లో ఎవరు అధికారం చేజిక్కించుకుంటారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే సీపీఐకి కాంగ్రెస్ మద్దతు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

సీపీఐ నేతలు పల్లా వెంకట్ రెడ్డి, ఈటీ నరసింహ శనివారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బి.మహేష్ కుమార్ గౌడ్ కూడా హాజరయ్యారు. కొత్తగూడెం కార్పొరేషన్ పై ప్రధానంగా చర్చించారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులను చెరో రెండున్నరేళ్ల చొప్పున పంచుకోవాలని నిర్ణయించారు. మొదటి రెండున్నరేళ్లు సీపీఐకి, ఆ తర్వాత కాంగ్రెస్‌కు మేయర్‌ పీఠం దక్కనుంది.

ఇక రాష్ట్రంలో మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక ఫిబ్రవరి 16న జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More