Telangana Police Recruitment Notifications 2026 : పోలీసు ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి పోలీసు నియామక మండలి (TSLPRB) నాలుగు నోటిఫికేషన్లను విడుదల చేసింది. పోలీసు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF), ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్, జైళ్ల శాఖల్లో మొత్తం 7,437 పోస్టులను భర్తీ చేయనున్నారు.
శాఖల వారీగా ఖాళీల వివరాలు….
పోలీసు శాఖ :
- సబ్ ఇన్స్‌పెక్టర్ (సివిల్): 148
- రిజర్వ్ సబ్ ఇన్స్‌పెక్టర్ (AR): 14
- రిజర్వ్ సబ్ ఇన్స్‌పెక్టర్ (TGSP): 12
- రిజర్వ్ సబ్ ఇన్స్‌పెక్టర్ (SARCPL): 3
- అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్ (FPB): 23
- పోలీసు కానిస్టేబుల్ (సివిల్): 3,697
- పోలీసు కానిస్టేబుల్ (AR): 1,052
- పోలీసు కానిస్టేబుల్ (SARCPL): 24
- పోలీసు కానిస్టేబుల్ (డ్రైవర్) PTO: 20
- పోలీసు కానిస్టేబుల్ (మెకానిక్) PTO: 7
స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ - SPF :
- సబ్ ఇన్స్‌పెక్టర్: 44
- కానిస్టేబుల్: 1,380
ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ :
- స్టేషన్ ఫైర్ ఆఫీసర్: 39
- ఫైర్‌ఫైటర్: 751
జైళ్ల శాఖ :
- డిప్యూటీ జైలర్ (పురుషులు): 14
- డిప్యూటీ జైలర్ (మహిళలు): 1
- వార్డర్ (పురుషులు): 196
- వార్డర్ (మహిళలు): 12

{{^htLoading}} {{/htLoading}}
దరఖాస్తు తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ (www.tgprb.in) ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}