TG POLYCET 2026 Counselling Schedule : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం (2026-27) డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 27వ తేదీ నుంచి పాలిసెట్ (POLYCET) కౌన్సెలింగ్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది.
టీజీ పాలిసెట్ ఫలితాలు ఎప్పుడంటే..?

ఈ ఏడాది మే 13వ తేదీన పాలిసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే… ఈ నెల 23వ తేదీ లోపు పరీక్ష ఫలితాలను వెల్లడించనున్నారు. ఫలితాల విడుదలకు ముందే కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను జారీ చేయడం ఈసారి విశేషం. దీనివల్ల విద్యార్థులకు ముందస్తు ప్రణాళిక వేసుకోవడానికి తగిన సమయం దొరుకుతుంది. ఇక టీజీ పాలిసెట్ ఫలితాలు విడుదలైన తర్వాత https://www.polycet.sbtet.telangana.gov.in/ వెబ్ సైట్ నుంచి ర్యాంక్ కార్డుని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
టీజీ పాలిసెట్ 2026 - తొలి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ :
టీజీ పాలిసెట్ ఉత్తీర్ణులైన అభ్యర్థుల కోసం మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ మే 27 నుంచి జూన్ మొదటి వారం వరకు సాగనుంది. దీనికి సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఇలా ఉన్నాయి.
- మే 27 నుంచి 31 వరకు : అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ప్రాసెస్ ఫీజు చెల్లించి, ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలి.
- మే 29 నుంచి జూన్ 1 వరకు : హెల్ప్‌లైన్ కేంద్రాలలో అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన (ధ్రువపత్రాల పరిశీలన) జరుగుతుంది.
- మే 29 నుంచి జూన్ 3 వరకు : సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలలు, కోర్సులను ఎంచుకోవడానికి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.
- జూన్ 6న : అభ్యర్థుల మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా మొదటి విడత సీట్ల కేటాయింపు చేపడతారు.
- జూన్ 6 నుంచి 9 వరకు : సీటు పొందిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ట్యూషన్ ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
- జూన్ 8 మరియు 9 తేదీల్లో : విద్యార్థులు తమకు సీటు వచ్చిన పాలిటెక్నిక్ కళాశాలల్లో నేరుగా ఒరిజినల్ సర్టిఫికెట్లతో రిపోర్ట్ చేయాలి.
- జూన్ 9న : పాలిటెక్నిక్ కొత్త విద్యా సంవత్సరం (తరగతులు) ప్రారంభమవుతుంది.
మొదటి విడత సీట్ల భర్తీ అనంతరం మిగిలిపోయిన సీట్ల కోసం చివరి విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ జూన్ 15న ప్రారంభమై జూన్ 22వ తేదీతో ముగుస్తుంది. ఆ తర్వాత కూడా జూన్ 27 నుంచి జూన్ 30 వరకు ఇంటర్నల్ స్లైడింగ్ (Internal Sliding) అవకాశం కల్పించారు. దీని ద్వారా విద్యార్థులు తాము చేరిన కళాశాలలోనే ఒక బ్రాంచ్ (ఉదాహరణకు మెకానికల్) నుంచి మరో బ్రాంచ్ (ఉదాహరణకు కంప్యూటర్ సైన్స్) కు మారడానికి అవకాశం ఉంటుంది. ఇక చివరగా మిగిలిపోయే సీట్లను భర్తీ చేయడానికి జూలై 1 నుంచి జూలై 8వ తేదీల మధ్య స్పాట్ ప్రవేశాలు (Spot Admissions) నిర్వహించాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది.
{{/usCountry}}మొదటి విడత సీట్ల భర్తీ అనంతరం మిగిలిపోయిన సీట్ల కోసం చివరి విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ జూన్ 15న ప్రారంభమై జూన్ 22వ తేదీతో ముగుస్తుంది. ఆ తర్వాత కూడా జూన్ 27 నుంచి జూన్ 30 వరకు ఇంటర్నల్ స్లైడింగ్ (Internal Sliding) అవకాశం కల్పించారు. దీని ద్వారా విద్యార్థులు తాము చేరిన కళాశాలలోనే ఒక బ్రాంచ్ (ఉదాహరణకు మెకానికల్) నుంచి మరో బ్రాంచ్ (ఉదాహరణకు కంప్యూటర్ సైన్స్) కు మారడానికి అవకాశం ఉంటుంది. ఇక చివరగా మిగిలిపోయే సీట్లను భర్తీ చేయడానికి జూలై 1 నుంచి జూలై 8వ తేదీల మధ్య స్పాట్ ప్రవేశాలు (Spot Admissions) నిర్వహించాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది.
{{/usCountry}}