...
...
Next Story

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు వచ్చేశాయ్, స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ చేపట్టింది. లబ్దిదారులకు ఇప్పటికే మెసేజ్ లు పంపిస్తుంది. కొత్త కార్డులు పొందిన వారు ఈ నెల రేషన్ తీసుకోవచ్చని పేర్కొంది. అలాగే కొత్త కార్డుల స్టేటస్ అధికారిక వెబ్ సైట్ లో తనిఖీ చేసుకోవచ్చని సూచించింది.

Published on: May 15, 2025 04:14 PM IST
By
Prefer HTon Google
Advertisement

తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తుంది. ఎన్నో ఏళ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎట్టకేలకు కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసి...మే నెల నుంచి రేషన్ తీసుకునేందుకు అర్హులని మెసేజ్ లు పంపిస్తుంది.

మే నెల రేషన్

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు వచ్చేశాయ్, స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు వచ్చేశాయ్, స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

కొత్త కార్డులు పొందిన వారు చౌక ధరల దుకాణాల నుంచి మే నెల రేషన్ బియ్యం పొందవచ్చని సివిల్ సప్లై అధికారులు తెలిపారు. కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు రేషన్ కార్డు నెంబర్ తో పాటు మెసేజ్ లు పంపామని, వారు తమ కార్డు స్టేటస్ ను తనిఖీ చేయవచ్చని చెప్పారు.

కొత్త కార్డులకు దరఖాస్తు చేసుకున్న మీ సేవాలో ఇచ్చిన రిఫరెన్స్ నెంబర్ ఆధారంగా స్టేటస్ ను చెక్ చేసుకోవచ్చు.

కుటుంబ సభ్యుల వివరాలు

రేషన్ కార్డు నెంబర్ ఆధారంగా అధికారిక వెబ్‌సైట్‌లో తమ కార్డును నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ కార్డులో కుటుంబసభ్యుల పూర్తి వివరాలు చూపిస్తాయి. అధికారిక వెబ్‌సైట్‌ లో రిఫరెన్స్ నెంబర్ లేదా కొత్త లేదా పాత రేషన్ కార్డు నెంబర్ ను ఎంటర్ చేయాలి.

ఆ తర్వాత జిల్లా పేరును సెలెక్ట్ చేసి సెర్చ్ చేస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి. వెబ్ సైట్ లో రేషన్ కార్డు స్థితి తెలియకపోతే స్థానిక మండల ఆఫీసుల్లో తమ దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవచ్చు.

కొత్త రేషన్ కార్డు స్టేటస్ ఎలా తెలుసుకోవచ్చు?

  1. దరఖాస్తుదారుడు https://epds.telangana.gov.in/FoodSecurityAct/ వెబ్ సైట్ లింక్ పై క్లిక్ చేయండి.
  2. హోంపేజీలో 'FSC Search' ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  3. ఆ తర్వాత పేజీలో 'Ration Card Search' డ్రాప్ డౌన్ లో 'FSC Search' ఆప్షన్ పై క్లి్క్ చేయండి.
  4. అనంతరం ఎఫ్ఎస్సీ రిఫరెన్స్ నెంబర్ లేదా పాత రేషన్ కార్డు లేదా ప్రస్తుత రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి.
  5. మీ జిల్లాను ఎంపిక చేసి సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  6. రేషన్ కార్డు పూర్తి వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు స్క్రీన్ పై కనిపిస్తాయి.

కొత్త పేర్లు జోడింపు

మీసేవా కేంద్రాలు, ప్రజా పాలన, గ్రామ సభలు, కుల గణన సర్వేల ద్వారా వచ్చిన దరఖాస్తుల ఆధారంగా కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తున్నట్లు సివిల్ సప్లై అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ రేషన్ కార్డు ఉన్నా, ఎక్కడైనా రేషన్ షాపుకు వెళ్లి సరకులు పొందవచ్చని పేర్కొన్నారు. కొత్తకార్డులకు ఈ నెల నుంచి రేషన్ సరుకులు ఇస్తున్నట్లు ప్రకటించారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe