Telangana Weather Updates : రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గుముఖం - పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..!
రాష్ట్రంలో చలి గాలుల తీవ్రత తగ్గింది. గడిచిన 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వివరాల ప్రకారం… చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే రెండు నుంచి ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగాయి.
రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత తగ్గింది. గడిచిన రెండు రోజుల పాటు నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే… రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వివరాల ప్రకారం… చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతల నమోదులో గణనీయమైన మార్పులు కనిపించాయి. సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగాయి.

పెరిగిన ఉష్ణోగ్రతలు….
గత కొద్ది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయని వాతావరణ శాస్త్రవేత శ్రీనివాసరావు తెలిపారు. చాలా చోట్ల సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో శీతలగాలుల పరిస్థితి తగ్గిందన్నారు. గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయని వివరించారు.
“ ఈశాన్య మరియు ఉత్తర దిశ నుంచి తూర్పు మరియు ఆగ్నేయ దిశకు గాలులు వీయటమే ఈ మార్పునకు కారణం. రాత్రి ఉష్ణోగ్రతలు 4 నుంచి 5 డిగ్రీలు పెరిగాయి. మిగిలిన వారంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలో ఉండే అవకాశం ఉంది. రానున్న 3-4 రోజుల్లో హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రతల్లో కూడా మార్పులుండే అవకాశాలు ఉన్నాయి” అని శ్రీనివాసరావు పేర్కొన్నారు.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాల ప్రకారం... రాష్ట్రంలో పూర్తిగా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు లేవు. ఈ వారమంతా కూడా ఇదే మాదిరి వాతావరణ పరిస్థితులుంటాయి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

