పెండింగ్‌లో ఉన్న విదేశీ స్కాలర్‌షిప్ బకాయిలు రూ.303 కోట్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం విదేశీ స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేసింది. ఈ విషయాన్ని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.

Published on: Oct 30, 2025, 08:12:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న విదేశీ స్కాలర్‌షిప్ బకాయిల కోసం రూ.303 కోట్లు విడుదల చేసింది. 2022 నుండి అన్ని బకాయిలను ప్రభుత్వం క్లియర్ చేసిందని మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.

స్కాలర్‌షిప్ విడుదల
స్కాలర్‌షిప్ విడుదల

'పెరుగుతున్న జీవన వ్యయాలు, విదేశాలలో కొత్త ఆంక్షలు, పెరుగుతున్న విద్యా ఖర్చులు వేలాది కుటుంబాలకు తీవ్ర ఇబ్బందులను కలిగించాయి. ప్రతి విద్యార్థికి సుమారు రూ. 20 లక్షల సకాలంలో సహాయం అందించడం చాలా అవసరమైన ఉపశమనం, ఆశను తెస్తుంది.' అని మల్లు భట్టి విక్రమార్క ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ఇదిలా ఉండగా తెలంగాణలోని ప్రైవేట్ కళాశాలలు ఇప్పటికీ రూ.900 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నాయి. తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య (TFHEI) ఛైర్మన్ రమేష్ బాబు ఇటీవల మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న రూ.1,200 కోట్ల బకాయిల్లో రూ.300 కోట్లు మాత్రమే చెల్లించిందని పేర్కొన్నారు.

నవంబర్ 1 నాటికి రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోతే నవంబర్ 3 నుండి రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ కళాశాలల నిరవధిక బంద్‌కు ఆయన పిలుపునిచ్చారు. రూ.1200 కోట్ల బకాయిలు చెల్లిస్తామని రూ.300 కోట్లు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.

మంత్రులు మాకు సహకరించడం లేదని రమేశ్ బాబు అన్నారు. నవంబర్ 1లోపు రూ.900 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రావాల్సిన బకాయిలపై స్పష్టత ఇవ్వాలన్నారు. నవంబర్ 1న రూ.900 కోట్ల బకాయిలు విడుదల చేయకపోతే నవంబర్ 3వ తేదీ నుంచి నిరవధిక బంద్ పాటిస్తామన్నారు. నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. వాళ్ల స్వార్థం కోసం మమ్మల్ని భయపెడితే ఊరుకోమని, ఒక్క పోలీసును కూడా కాలేజీలోకి అనుమతించమని చెప్పారు.

ఇటీవలే బంద్‌కు పిలుపునిచ్చినప్పటికీ ప్రభుత్వం నుంచి హామీ రావటంతో కాలేజీలు వెనక్కి తగ్గాయి. అయితే బకాయిల చెల్లింపుల విషయంలో జాప్యం నెలకొంది. బంద్‌కు సంబంధించి ప్రైవేటు కాలేజీల యాజమాన్యం కార్యాచరణను కూడా ప్రకటించింది. ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని వెంటనే బకాయిలు చెల్లించాలని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. అందులో భాగంగానే ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోతే నవంబర్ 3వ తేదీ నుంచి కాలేజీలను మూసి వేస్తామని తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య స్పష్టం చేసింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More