...
...
Next Story

తెలంగాణలో సర్ ఓటర్ డ్రాఫ్ట్ విడుదల.. మీ ఓటు ఇలా చెక్ చేసుకోండి

తెలంగాణలో సర్ ఓటర్ డ్రాఫ్ట్‌ను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్ వెళ్లి మీ ఓటు చెక్ చేసుకోవచ్చు. ఎలా చూడాలో ఇక్కడ తెలుసుకోండి.

Published on: Aug 17, 2026, 17:11:46 IST
Advertisement

తెలంగాణ రాష్ట్రంలో సర్ ఓటర్ డ్రాఫ్ట్ జాబితా విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా ఈ డ్రాఫ్ట్ రోల్‌ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సి. సుదర్శన్ రెడ్డి అధికారికంగా ప్రచురించారు. ఓటర్లు తమ వివరాలను సరిచూసుకోవడానికి, కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ జాబితా ఎంతగానో ఉపయోగపడుతుంది.

సర్ ఓటర్ డ్రాఫ్ట్ రిలీజ్
సర్ ఓటర్ డ్రాఫ్ట్ రిలీజ్

మెుత్తం 3.38 కోట్లకుపైగా ఓటర్లు ఉండగా.., ఇప్పటిదాకా 2.64 కోట్ల మంది మాత్రమే ఎన్యుమరేషన్ ఫామ్స్ సమర్పించారు. మరో 57.46 లక్షల మంది అడ్రస్ మారడం లేదా అందుబాటులో లేకపోవడంతో వారి వివరాలు పెండింగ్‌లో ఉన్నాయి.

ఓటర్లు తమ పేరు, చిరునామా, ఇతర వివరాలు ఓటర్ల జాబితాలో సరిగ్గా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి Chief Electoral Officer, Telangana Portal వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. డిజిటల్ విధానంలో సులభంగా ఓటరు కార్డు వివరాలను తనిఖీ చేసుకునే వెసులుబాటును ఎన్నికల సంఘం కల్పించింది.

ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియ ద్వారా నమోదులో ఏవైనా లోపాలు ఉన్నవారిని గుర్తించారు. పేరు, తండ్రి పేరు, తోబుట్టువుల మధ్య వయస్సు వ్యత్యాసం, తల్లిదండ్రులతో ఉన్న వయస్సు అంతరం వంటి అంశాలలో లాజికల్ వ్యత్యాసాలు ఉన్న సుమారు 60 లక్షల మంది ఓటర్లకు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు త్వరలోనే నోటీసులు పంపనున్నారు. ఎన్నికల సంఘం కేంద్ర కార్యాలయం నుండి ఈ నోటీసులు నేరుగా ఆయా నియోజకవర్గాల పరిధిలోని ఓటర్లకు చేరుతాయి.

ఆగస్టు 17 (సోమవారం) నుండి ప్రారంభమై సెప్టెంబర్ 16 వరకు ఫిర్యాదులు, అభ్యంతరాల స్వీకరణ కొనసాగుతుంది. నమోదు చేసుకున్న పిటిషన్లు, అభ్యంతరాల పరిశీలన సోమవారం నుండే ప్రారంభమై అక్టోబర్ 15 వరకు పూర్తవుతుంది. అన్ని దరఖాస్తులను పరిశీలించిన అనంతరం తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 19న విడుదల చేస్తారు.

ఈ లింక్ క్లిక్ చేసి తెలంగాణ SIR DraftRoll 2026 చూడండి

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe