...
...
Next Story

SIR in Telangana : ముమ్మరంగా ఓటర్ల జాబితా సవరణ - రాష్ట్రవ్యాప్తంగా 1.43 కోట్ల పత్రాల పంపిణీ

Telangana SIR Exercise : తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (SIR) ప్రక్రియ వేగంగా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1.43 కోట్ల ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

Published on: Jun 29, 2026, 06:57:28 IST
Advertisement

Telangana SIR Exercise : తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (SIR) ప్రక్రియ అత్యంత వేగంగా ముందుకు సాగుతోంది. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,43,17,635 ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. దీని ద్వారా రాష్ట్రంలోని 42.33 శాతం ప్రాంతాన్ని కవర్ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

ఎన్యూమరేషన్‌ పత్రాల పంపిణీ
ఎన్యూమరేషన్‌ పత్రాల పంపిణీ

తెలంగాణలో గురువారం నుంచే ఈ ఓటర్ల జాబితా ముమ్మర సవరణ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఉన్న 16 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లోని దాదాపు 36 కోట్ల మంది ఓటర్లను కలుపుకుంటూ ఫేజ్-3 కింద ఈ ప్రత్యేక ముమ్మర సవరణను చేపడుతున్నట్లు భారత ఎన్నికల సంఘం (ECI) మే 14నే ప్రకటించింది. ఇందులో భాగంగానే తెలంగాణలోనూ కసరత్తు జరుగుతోంది.

జనగణనతో అనుసంధానం…

ప్రస్తుతం దేశంలో జరుగుతున్న జనగణన (సెన్సస్) హౌస్ లిస్టింగ్ ప్రక్రియతో సమన్వయం చేసుకుంటూ ఈ ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని రూపొందించినట్లు ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో పేర్కొంది. దీనివల్ల క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న యంత్రాంగాన్ని, సిబ్బందిని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి వీలవుతుందని వివరించింది. ఈ సవరణ ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘం స్పష్టమైన కాలపరిమితితో కూడిన షెడ్యూల్‌ను ఖరారు చేసింది.

కీలకమైన తేదీలు - షెడ్యూల్ వివరాలు

తెలంగాణతో పాటు పంజాబ్ రాష్ట్రానికి ఓటరుగా నమోదు చేసుకోవడానికి 2026 అక్టోబర్ 1వ తేదీని అర్హత తేదీగా (Qualifying Date) నిర్ణయించారు. అంటే ఈ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారందరూ కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులు.

  • సన్నాహక దశ (Preparation Phase): 2026 జూన్ 15 నుండి జూన్ 24 వరకు ఈ ప్రక్రియను నిర్వహించారు.
  • బీఎల్ఓల ఇంటింటి సర్వే (BLO Visits): 2026 జూన్ 25న ప్రారంభమైన ఈ సర్వే జూలై 24 వరకు కొనసాగుతుంది. బూత్ స్థాయి అధికారులు (BLO) ప్రతి ఇంటికి వెళ్లి వివరాలను సేకరిస్తారు.
  • రేషనలైజేషన్: పోలింగ్ కేంద్రాల సర్దుబాటు, ఇతర సాంకేతిక ప్రక్రియలను 2026 జూలై 24 లోగా పూర్తి చేస్తారు.
  • నమోదు ముసాయిదా ప్రచురణ : 2026 జూలై 31న ఓటర్ల జాబితా ముసాయిదాను అధికారికంగా విడుదల చేస్తారు.
  • అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరణ: ముసాయిదా జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే లేదా కొత్తగా పేర్లు నమోదు చేసుకోవాలనుకుంటే 2026 జూలై 31 నుండి ఆగస్టు 30 వరకు గడువు ఉంటుంది.
  • నోటీసుల జారీ, పరిష్కారం: అందిన దరఖాస్తులు, అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరించే ప్రక్రియ 2026 జూలై 31 నుండి సెప్టెంబర్ 28 వరకు కొనసాగుతుంది.
  • తుది ఓటర్ల జాబితా విడుదల: అన్ని సవరణలు పూర్తి చేసిన తర్వాత 2026 అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితాను (Final Electoral Roll) అధికారికంగా ప్రచురిస్తారు.
  • తెలంగాణ వ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ఎన్నికల సంఘం ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe