...
...
Next Story

పదో తరగతి విద్యార్థులకు అప్డేట్ - పరీక్ష ఫీజు గడువు పొడిగింపు, కొత్త తేదీలివే

తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. పరీక్షల ఫీజు చెల్లించే గడువును నవంబర్ 20వ తేదీ వరకు పొడిగించారు. ఆలస్య రుసుం రూ.500తో డిసెంబర్‌ 15 నుంచి 29 వరకు ఫీజు చెల్లించుకోవచ్చు.

Published on: Nov 14, 2025 08:35 AM IST
Advertisement

పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజులపై కీలక అప్డేట్ వచ్చేసింది. ఆలస్య రుసుం లేకుండా పరీక్షల ఫీజు చెల్లించే గడువును ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించారు. ఈ గడువు నవంబర్ 13తో ఈ గడువు ముగిసింది. అయితే ఈ సమయాన్ని నవంబర్ 20 వరకు పొడిగించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు పీవీ శ్రీహరి గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.

తెలంగాణ టెన్త్ పరీక్షలు 2026
తెలంగాణ టెన్త్ పరీక్షలు 2026

రూ. 50 ఆలస్య రుసుముతో నవంబర్ 21వ తేదీ నుంచి 29 వరకు ఫీజు చెల్లించుకోవచ్చు. ఇక రూ. 200 ఫైన్ తో డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 11 వరకు, రూ.500 ఆలస్య రుసుంతో డిసెంబర్‌ 15 నుంచి 29 వరకు ఫీజు చెల్లించుకునే అవకాశం ఉంది.

అన్ని సబ్జెక్టులకు రుసుము రూ.125గా నిర్ణయించారు. మూడు సబ్జెక్టుల వరకు రూ.110. రెగ్యులర్ పరీక్ష రుసుముతో పాటు వృత్తి విద్యా అభ్యర్థులు రూ.60 చెల్లించాలి. ఇప్పటికే గడువు పొడిగించిన నేపథ్యంలో మరోసారి…. పరీక్ష రుసుము చెల్లించడానికి గడువు తేదీలు ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగింపు ఉండదు.

విద్యార్థులు https://bse.telangana.gov.in/ వెబ్ సైట్ లో వివరాలను తెలుసుకోవచ్చు. ఇక పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe