TG SSC Marks Memo : తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అప్డేట్ - ఒరిజినల్ లాంగ్ మెమోలు వచ్చేశాయ్..! ఇలా తీసుకోండి

Telangana SSC Original Marks Memos 2026 : తెలంగాణ పదో తరగతి విద్యార్థుల ఒరిజినల్ లాంగ్ మెమోలను పాఠశాలలకు పంపుతున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపింది. ఆయా విద్యార్థులు హెచ్‌ఎంలను సంప్రదించి సర్టిఫికెట్లు తీసుకోవచ్చని సూచించింది.

Published on: Aug 29, 2026, 15:03:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Telangana SSC Original Marks Memo 2026 : తెలంగాణలో పదో తరగతి పూర్చి చేసిన విద్యార్థులకు ప్రభుత్వ పరీక్షల విభాగం కీలక అప్‌డేట్ అందించింది. టెన్త్ ఒరిజినల్ మార్కుల జాబితాల (లాంగ్ మెమోలు) పంపిణీ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఈ మేరకు పదో తరగతి ఒరిజినల్ సర్టిఫికెట్లను నేరుగా సంబంధిత పాఠశాలలకే పంపిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కే. లింగయ్య శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

తెలంగాణ టెన్త్ పరీక్షలు 2026 (ఫైల్ ఫొటో)
తెలంగాణ టెన్త్ పరీక్షలు 2026 (ఫైల్ ఫొటో)

స్కూళ్లకు వెళ్లి పొందొచ్చు…

వార్షిక పరీక్షలతో పాటు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన విద్యార్థులందరి ఒరిజినల్ మెమోలను విద్యాశాఖ సిద్ధం చేసింది. శనివారం నుంచే ఈ సర్టిఫికెట్లను అన్ని బడులకు రవాణా చేస్తున్నట్లు అధికారులు వివరించారు. విద్యార్థులు తమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను (హెచ్‌ఎం) నేరుగా సంప్రదించి… తమ ఒరిజినల్ లాంగ్ మెమోలను పొందవచ్చని సూచించారు.

పైౌ చదవుల్లో భాగంగా ఉన్నత కోర్సుల ప్రవేశాలు, ఇతర భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఈ ఒరిజినల్ సర్టిఫికెట్లు అత్యంత కీలకమైనవి. దీంతో విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా తమ పాఠశాలలకు వెళ్లి హెచ్‌ఎంల ద్వారా ఒరిజినల్ మెమోలను తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.

ఇక ఈ ఏడాది జూన్ 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. రెగ్యులర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన వారితో పాటు, మార్కులు తక్కువగా వచ్చి స్కోర్ పెంచుకోవాలనుకున్న (ఇంప్రూవ్‌మెంట్) విద్యార్థులు కూడా ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈ ఫలితాలు కూడా అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే షార్ట్ మెమోలు వచ్చినప్పటికీ… తాజాగా లాంగ్ ఒరిజినల్ మెమోలను విద్యాశాఖ స్కూళ్లకు అందజేసింది.

టెన్త్ ఫలితాలు చూసుకోవడం ఎలా?

  • ముందుగా తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్ అయిన bse.telangana.gov.in ఓపెన్ చేయండి.
  • హోమ్‌పేజీలో అందుబాటులో ఉండే ఫలితాల లింక్స్ పై క్లిక్ చేయండి.
  • మీ టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ హాల్ టికెట్ నంబర్ (Hall Ticket Number) ఎంటర్ చేయండి.
  • వివరాలు ఇచ్చాక 'Submit' బటన్‌పై క్లిక్ చేయాలి. మీ మార్కుల మెమో స్క్రీన్‌పై కనిపిస్తుంది. భవిష్యత్తు అవసరాల కోసం దాన్ని ప్రింట్ లేదా పీడీఎఫ్ రూపంలో సేవ్ చేసుకోండి.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More