TG SSC Results 2026 : తెలంగాణ పదో తరగతి ఫలితాలు - క్షణాల్లోనే మీ వాట్సప్‌కు మార్కుల మెమో..! ఇలా చేయండి
Telangana SSC 10th class Results 2026 : తెలంగాణ పదో తరగతి ఫలితాలు ఇవాళ మధ్యాహ్నం 2:00 గంటలకు విడుదలవుతాయి. విద్యార్థులు తమ ఫలితాలను మీ సేవ వాట్సాప్ చాట్‌బాట్ ద్వారా సులభంగా పొందొచ్చు. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి….
Telangana SSC 10th class Results 2026 : పదో తరగతి విద్యార్థులు, తల్లిదండ్రులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.ఇవాళ విడుదలయ్యే పదో తరగతి ఫలితాలు ఇంటిదగ్గర నుంచే క్షణాల్లో పొందే అవకాశాన్ని కల్పించింది. ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా సెల్ ఫోన్ లోనే ఫలితాలను చాలా సులభంగా చెక్ చేసుకోవచ్చు.

తెలంగాణ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ESD) విభాగం… SSC (సెకండరీ స్కూల్ సర్టిఫికేట్) ఫలితాలు-2026ను మీ సేవ వాట్సాప్/చాట్‌బాట్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంచుతారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు తమ ఫలితాలను 29 ఏప్రిల్ 2026 (బుధవారం) మధ్యాహ్నం 2:00 గంటల నుంచి వాట్సాప్ ద్వారా ద్వారా వెంటనే పొందవచ్చు.
పదో తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఇప్పుడు అధికారిక మీ సేవ వాట్సాప్ నంబర్ 8096958096 ద్వారా సులభంగా తమ ఫలితాలను పొందవచ్చు. దీనివల్ల వెబ్‌సైట్లలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా…. వేగంగా, అత్యంత సులభంగా ఫలితాలను పొందవచ్చు. ఈ సేవను తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌తో సమన్వయంతో మీ సేవ ద్వారా అందిస్తున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటన ద్వారా తెలిపింది.
వాట్సాప్ లో టెన్త్ ఫలితాలు - ఎలా చెక్ చేసుకోవాలంటే..?
1.మీ మొబైల్‌లో 8096958096 నంబర్‌ను “MeeSeva Telangana”గా సేవ్ చేసుకోండి.
2.WhatsApp ఓపెన్ చేసి “Hi” అని మెసేజ్ పంపండి.
3.“SSC Result” అని టైప్ చేయండి.
4.మెనులో ఓపెన్ సర్వీస్ ఎంపికపై క్లిక్ చేయండి.
5.మీ హాల్ టికెట్ నంబర్ నమోదు చేయండి.
6.వివరాలు సమర్పించిన వెంటనే మీ మార్కుల మెమో WhatsAppలో డిస్ ప్లే అవుతుంది.
18 నవంబర్ 2025న ప్రారంభించినప్పటి నుంచి మీ సేవ WhatsApp/చాట్‌బాట్ ప్లాట్‌ఫామ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి విశేష స్పందన పొందింది. ఇది వేగంగా విస్తరించిన డిజిటల్ సేవా వేదికలలో ఒకటిగా నిలిచింది. ఇటీవలే విడుదలైన ఇంటర్ ఫలితాలను కూడా వాట్సాప్ ద్వారా అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే…!
ముఖ్యమైన లింక్స్:
ఇక తెలంగాణ పదో తరగతి ఫలితాలను వాట్సాప్ ద్వారా మాత్రమే కాకుండా ప్రభుత్వ వెబ్ సైట్లలోనూ అందుబాటులో ఉంటాయి. ఆ లింక్స్ ఇక్కడ ఉన్నాయి…
- https://results.bsetelangana.org
- https://results.bse.telangana.gov.in
- https://bse.telangana.gov.in
- https://schooledu.telangana.gov.in
అంతేకాకుండా గతేడాది మాదిరిగానే హిందుస్తాన్ టైమ్స్ వెబ్ సైట్ ( https://www.hindustantimes.com/ ) లోనూ తెలంగాణ పదో తరగతి ఫలితాలు అందుబాటులో ఉంటాయి. విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా మార్కుల వివరాలను వేగంగా తెలుసుకోవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

