...
...
Next Story

కురుక్షేత్ర ఎన్‌ఐటీ క్యాంపస్ లో తెలంగాణ విద్యార్థి సూసైడ్

హర్యానాలోని కురుక్షేత్ర ఎన్‌ఐటీ క్యాంపస్ లో తెలంగాణకు చెందిన విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. తన హాస్టల్‌ రూమ్‌లో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Published on: Feb 17, 2026, 07:15:32 IST
Advertisement

తెలంగాణకు చెందిన 19 ఏళ్ల విద్యార్థి హర్యానాలోని కురుక్షేత్ర జిల్లాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) లో సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. అంగద్ శివ అనే విద్యార్థి హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు.

కురుక్షేత్ర ఎన్‌ఐటీలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య
కురుక్షేత్ర ఎన్‌ఐటీలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా మహేశ్వరి గ్రామానికి చెందిన శివ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ) లో డిగ్రీ చదువుతున్నాడు. ప్రస్తుతం క్యాంపస్ లోని హాస్టల్ గదిలో ఉంటున్నాడు. ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు తెలిపారు.

ఈ సంఘటన జరిగిన సమయంలో శివ ఒక్కడు మాత్రమే గదిలో ఉన్నాడు. అతని ఇద్దరూ రూమ్ మెంట్స్ హర్యాణనకు చెందినవారు కాగా… మధ్యాహ్న భోజనానికి వెళ్లారు. ఉదయం 10 గంటల సమయంలో శివ తరగతులకు హాజరయ్యాడు. ఆ తర్వాత తరగతి గది నుంచి నేరు హాస్టల్ కు వెళ్లాడు.

శివ మధ్యాహ్న భోజనం కోసం మెస్ కి రాకపోవడంతో… అతని రూమ్ మేట్స్ లో ఒకరు అతన్ని పిలవడానికి తిరిగి వెళ్లారు. గది లోపలి నుంచి లాక్ చేయబడింది. పదే పదే తలుపులు తట్టినా స్పందన లేదు. ఆ తర్వాత భవనం వెనుక వైపునకు వెళ్లి కిటికీ గుండా చూశాడు. శివ సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ ఉండటాన్ని చూశాడు.

ఈ విషయాన్ని వెంటనే ఎన్ఐటీ అడ్మినిస్ట్రేషన్ కు నివేదించడంతో పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం లోక్ నాయక్ జై ప్రకాష్ ఆసుపత్రి (ఎల్ఎన్జేపీ)కి తరలించారు. ఆపై శివ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల వాంగ్మూలం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ప్రాథమిక విచారణలో శివ తరచూ ఫోన్ లో మాట్లాడేవాడినని… కానీ తమకు అతని మాతృభాష అర్థం కాలేదని అతని స్నేహితులు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకోగా… దర్యాప్తు చేస్తున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks