TG CPGET 2026 : టీజీ సీపీగెట్ కు దరఖాస్తు చేశారా..? ఫైన్ లేకుండా ఇవాళే చివరి తేదీ
TG CPGET 2026 Application : తెలంగాణలోని యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే TG CPGET 2026 ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు ఇవాళే చివరి తేదీ. అర్హులైన విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
TG CPGET 2026 Application : రాష్ట్రంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, వాటి అనుబంధ కళాశాలల్లో పీజీ, పీజీ డిప్లొమా, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో సీట్ల భర్తీ కోసం నిర్వహించే తెలంగాణ స్టేట్ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (TG CPGET 2026) దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఈ గడువు నేటితో( ఫైన్ లేకుండా) పూర్తి కానుంది. కాబట్టి అర్హులైన విద్యార్థులు… వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

షెడ్యూల్ ప్రకారం…. ఎలాంటి ఆలస్య రుసుము (Late Fee) లేకుండా జూన్ 10 వరకు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. గడువు ముగిసిన తర్వాత కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు చివరి నిమిషం దాకా ఆగకుండా….. సర్వర్ ఇబ్బందులను అధిగమించడానికి వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవడం మంచిదని అధికారులు చెబుతున్నారు.
టీజీ సీపీగెట్ 2026 - ముఖ్యమైన తేదీలు :
- రుసుము లేకుండా చివరి తేదీ : జూన్ 10, 2026
- 500 రూపాయల ఆలస్య రుసుముతో : జూన్ 14, 2026
- 2000 రూపాయల భారీ ఆలస్య రుసుముతో : జూన్ 18, 2026
- దరఖాస్తుల సవరణ (Correction): జూన్ 16 నుండి 19 వరకు
- హాల్ టికెట్ల డౌన్‌లోడ్: జూన్ 28, 2026 నుంచి
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఓసీ (OC), బీసీ (BC) అభ్యర్థులకు దరఖాస్తు రుసుము 800 రూపాయలుగా నిర్ణయించారు. ఎస్సీ (SC), ఎస్టీ (ST) మరియు దివ్యాంగులకు (PH) 600 రూపాయల ఫీజు ఉంటుంది. అదనపు సబ్జెక్టులు రాయాలనుకునే వారు ప్రతి సబ్జెక్టుకు 450 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTUH), తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం వంటి ప్రతిష్టాత్మక వర్సిటీల్లో ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్ సహా పలు కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది ఈ ప్రవేశ పరీక్ష బాధ్యతలను కాకతీయ యూనివర్శిటీ పర్యవేక్షిస్తోంది.
ఈ సీపీగెట్ ప్రవేశ పరీక్షను పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) మోడ్‌లో నిర్వహిస్తారు. జూలై 2026 మొదటి వారంలో పరీక్షలు జరిగే అవకాశం ఉంది. పరీక్ష ముగిసిన అనంతరం…. జూలై 17న ప్రాథమిక కీ విడుదల చేస్తారు. దీనిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే జూలై 19 వరకు సమర్పించవచ్చు. ప్రతి అభ్యంతరానికి రూ. 200 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ అభ్యంతరం సరైనదని తేలితే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించడం జరుగుతుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

