TG CPGET 2026 Counseling : టీజీ సీపీగెట్ కౌన్సెలింగ్ - ఈనెల 31 వరకు రిజిస్ట్రేషన్లకు గడువు!
TG CPGET 2026 Counseling : రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పిజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ సీపీగెట్ 2026 తొలి విడత కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ల గడువు ఈనెల 31తో ముగుస్తుంది. సెప్టెంబర్ 14వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది.
TG CPGET 2026 Counseling Schedule : రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన సీపీగెట్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. ఈ గడువు ఈనెల 31తో ముగుస్తుంది.

ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (TG CPGET - 2026) ర్యాంకుల ఆధారంగా ఎంఏ (MA), ఎంకాం , ఎంఎస్‌సీ (MSc)తో పాటు ఇతర పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు.అభ్యర్థులు తమకు ఇష్టమైన కళాశాలలు, కోర్సులను ఎంచుకోవడానికి సెప్టెంబర్ 8 నుంచి 10వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.మొదటి విడత సీట్ల కేటాయింపు వివరాలను సెప్టెంబర్ 14న అధికారిక వెబ్‌సైట్‌లో ప్రదర్శిస్తారు.
టీజీ సీపీగెట్ లో అర్హత సాధించిన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా తమ వివరాలను నమోదు చేసుకుని, ఆప్షన్లను జాగ్రత్తగా ఎంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత విద్యార్థులు తమ ప్రాధాన్యతల ప్రకారం కళాశాలలను ఎంచుకునేందుకు వెబ్ ఆప్షన్ల సదుపాయం కల్పిస్తారు.
ముఖ్య తేదీలు
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు సర్టిఫికెట్ల పరిశీలన : సీపీగెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ఆగస్ట్ 31వ తేదీ వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
- సవరణలకు అవకాశం (కరెక్షన్స్): సర్టిఫికెట్ల వివరాలలో ఏవైనా సరిదిద్దుకోవాల్సిన తప్పులు ఉంటే ఇమెయిల్ సపోర్ట్ ద్వారా సెప్టెంబర్ 5న మార్పులు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
- వెబ్ ఆప్షన్ల నమోదు : అభ్యర్థులు తమకు ఇష్టమైన కళాశాలలు, కోర్సులను ఎంచుకోవడానికి సెప్టెంబర్ 8 నుంచి 10వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.
- వెబ్ ఆప్షన్ల సవరణ : నమోదు చేసుకున్న వెబ్ ఆప్షన్లలో ఏవైనా మార్పులు చేయాలనుకుంటే సెప్టెంబర్ 11న అవకాశం ఉంటుంది.
- ప్రొవిజనల్ సీట్ల కేటాయింపు : మొదటి విడత సీట్ల కేటాయింపు వివరాలను సెప్టెంబర్ 14న అధికారిక వెబ్‌సైట్‌లో ప్రదర్శిస్తారు.
- కళాశాలల్లో రిపోర్టింగ్ : సీటు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 18వ తేదీలోగా తమకు కేటాయించిన కళాశాలల్లో వ్యక్తిగతంగా హాజరై నివేదించాల్సి ఉంటుంది.
- రెండవ విడత రిజిస్ట్రేషన్లు : సెప్టెంబర్ 19వ తేదీ నుంచి రెండవ విడత ప్రవేశాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
- అధికారిక వెబ్ సైట్ - https://cpgetadmissions.com/
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

