...
...
Next Story

TG DOST Web Options : దోస్త్ మూడో విడత వెబ్ ఆప్షన్లు ప్రారంభం - సీట్ల కేటాయింపు ఎప్పుడంటే..?

TG DOST Web Options 2026 : రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ‘టీజీ దోస్త్’ మూడో విడత కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన విద్యార్థులు జూన్ 16 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.

Published on: Jun 2, 2026, 08:16:58 IST
Advertisement

TG DOST Web Options 2026 : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది. డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (TG DOST) 2026 విద్యాసంవత్సరానికి గానూ మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.

దోస్త్ వెబ్ ఆప్షన్లు
దోస్త్ వెబ్ ఆప్షన్లు

ఇప్పటికే రిజిస్ట్రేషన్లు ప్రారంభంగా… అత్యంత కీలకమైన వెబ్ ఆప్షన్లు ఎంచుకునేందుకు ఉన్నత విద్యామండలి అవకాశం కల్పించింది. ఈ మూడో విడత వెబ్ ఆప్షన్ల ప్రక్రియ జూన్ 16వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. డిగ్రీలో చేరాలనుకునే అభ్యర్థులు తమకు నచ్చిన కాలేజీలు, గ్రూపులు, కోర్సులను ప్రాధాన్యత క్రమంలో అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఎంచుకోవాల్సి ఉంటుంది.

జూన్ 20న సీట్ల కేటాయింపు

మూడో విడత కౌన్సెలింగ్‌లో భాగంగా విద్యార్థులు సమర్పించిన వెబ్ ఆప్షన్లను అధికారులు పరిశీలిస్తారు. అభ్యర్థుల మెరిట్ మార్కులు, రిజర్వేషన్ల నిబంధనల ఆధారంగా జూన్ 20వ తేదీన ఫేజ్ 3 తుది సీట్ల కేటాయింపు ఫలితాలను విడుదల చేస్తారు.

సీట్లు పొందిన విద్యార్థులు తమ ప్రవేశాన్ని ఖరారు చేసుకోవడానికి జూన్ 20 నుండి జూన్ 25వ తేదీ మధ్యలో ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని వారి సీట్లు రద్దవుతాయి.

కొత్తగా దోస్త్ కౌన్సెలింగ్ కోసం రిజిస్టర్ చేసుకునే అభ్యర్థులు తమ ఆధార్ కార్డ్‌కు మొబైల్ నంబర్ లింక్ అయి ఉండేలా చూసుకోవడం తప్పనిసరి. దీనివల్ల ఓటీపీల ప్రక్రియ సులువవుతుంది. ఇప్పటికే మొదటి లేదా రెండో విడత కౌన్సెలింగ్‌లో సీటు సాధించి, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసిన విద్యార్థులు కూడా మెరుగైన కాలేజీల కోసం ఈ థర్డ్ ఫేజ్‌లో నేరుగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.

1. TS DOST అధికారిక వెబ్‌సైట్ https://dost.cgg.gov.in/ లోకి వెళ్లాలి.

2. హోం పేజీలో అందుబాటులో ఉన్న TS DOST 2026 రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.

3. ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది, అక్కడ అభ్యర్థులు తమను తాము నమోదు చేసుకోవాలి.

4. నమోదు పూర్తయిన తర్వాత, దరఖాస్తు పత్రాన్ని పూర్తి చేయాలి.

5. రిజిస్ట్రేషన్ పూర్తి అయిన విద్యార్థులు… వారి లాగిన్ వివరాల ద్వారా వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాలి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks