TG DOST Registrations 2026 : తెలంగాణ దోస్త్ సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం - ముఖ్యమైన తేదీలివే
TG DOST Phase 2 Registrations : రాష్ట్రంలోని డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే 'దోస్త్' (DOST) ఫేజ్-2 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి విడతలో సీటు రాని వారు…. కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.
TG DOST Phase 2 Registrations : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST) రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ షురూ అయింది.మొదటి విడతలో సీటు రాని విద్యార్థులు, కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.

టీజీ దోస్త్ ఫేజ్-2 రిజిస్ట్రేషన్లు…
దోస్త్ రెండో విడత ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2026 మే 15 నుంచి అధికారికంగా ప్రారంభమైంది. విద్యార్థులు రూ.400 అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి మే 25, 2026 వరకు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమకు నచ్చిన కాలేజీలు….. కోర్సులను ఎంచుకోవడానికి మే 15 నుంచే వెబ్ ఆప్షన్ల లింక్ కూడా అందుబాటులోకి వచ్చింది. వెబ్ ఆప్షన్ల నమోదుకు మే 26, 2026 వరకు గడువు ఉంటుంది.
రెండో విడతలో దరఖాస్తు చేసుకున్న వారిలో ప్రత్యేక కేటగిరీల కింద (PH - వికలాంగులు, CAP - సైనికోద్యోగుల పిల్లలు, NCC, స్పోర్ట్స్ మరియు ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్) రిజర్వేషన్లు కోరే అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలనను 2026 మే 26న నిర్వహించనున్నారు. అభ్యర్థులు సంబంధిత యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్లలో (UHLCs) తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది.
సీట్ల కేటాయింపు ఎప్పుడంటే..?
రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం విద్యార్థుల మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా… 2026 మే 30న దోస్త్ రెండో విడత సీట్ల కేటాయింపు (Phase-II Seat Allotment) ఫలితాలను విడుదల చేస్తారు. రెండో విడతలో సీట్లు పొందిన విద్యార్థులు… 2026 మే 31 నుంచి జూన్ 5 వరకు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్ రిపోర్టింగ్ చేయని అభ్యర్థుల సీట్లు రద్దవుతాయని అధికారులు స్పష్టం చేశారు.
TS DOST 2026: రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయాలి
1. TS DOST అధికారిక వెబ్‌సైట్ https://dost.cgg.gov.in/ ను సందర్శించండి.
2. హోం పేజీలో అందుబాటులో ఉన్న TS DOST 2026 రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
3. ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది, అక్కడ అభ్యర్థులు తమను తాము నమోదు చేసుకోవాలి.
4. నమోదు పూర్తయిన తర్వాత, దరఖాస్తు పత్రాన్ని పూరించండి.
5. దరఖాస్తు రుసుము చెల్లించండి.
6. సబ్మిట్ పై క్లిక్ చేసి పేజీని డౌన్‌లోడ్ చేసుకోండి.
7. తదుపరి అవసరం కోసం హార్డ్ కాపీని భద్రపరచుకోండి
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

