...
...
Next Story

TG DOST Registrations 2026 : దోస్త్ థర్డ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం - లింక్, ముఖ్యమైన తేదీల సమాచారం

TG DOST Phase 3 Registration 2026 : తెలంగాణ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘టీజీ దోస్త్’ మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ నేటి (మే 31) నుంచి ప్రారంభం కానుంది. జూన్ 15 వరకు కొత్త రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించగా… జూన్ 20న అభ్యర్థులకు తుది సీట్లను కేటాయించనున్నారు.

Published on: May 31, 2026 06:23 AM IST
Advertisement

TG DOST Phase 3 Registration 2026 : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో మూడేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ (UG) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తోన్న టీజీ దోస్త్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే మొదటి, రెండో విడత సీట్ల కేటాయింపు ప్రక్రియలు పూర్తి కాగా…నేటి నుంచి మూడో విడత ప్రక్రియ ప్రారంభమైంది.

దోస్త్ రిజిస్ట్రేషన్లు 2026
దోస్త్ రిజిస్ట్రేషన్లు 2026

గత రెండు విడతల్లో సీటు రాని విద్యార్థులు, సీటు వచ్చినా నచ్చని వారు మరియు ఇప్పటివరకు దోస్త్‌లో అసలు రిజిస్టర్ చేసుకోని అభ్యర్థులు ఈ మూడో విడత కౌన్సెలింగ్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ వంటి కోర్సుల్లో మిగిలిపోయిన సీట్లను ఈ విడత ద్వారా భర్తీ చేయనున్నారు.

టీజీ దోస్త్ ఫేజ్ 3 పూర్తి షెడ్యూల్:

  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు: మే 31 నుండి జూన్ 15 వరకు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు.
  • వెబ్ ఆప్షన్ల నమోదు: మూడో విడతకు సంబంధించిన వెబ్ ఆప్షన్లు (Web Options) జూన్ 16 వరకు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు తమకు నచ్చిన కాలేజీలు, కోర్సులను ప్రాధాన్యత క్రమంలో ఎంచుకోవాల్సి ఉంటుంది.
  • తుది సీట్ల కేటాయింపు: అభ్యర్థులు ఎంచుకున్న వెబ్ ఆప్షన్ల మెరిట్ మరియు రిజర్వేషన్ల ఆధారంగా జూన్ 20న ఫేజ్ 3 తుది సీట్ల కేటాయింపు (Seat Allotment) ఫలితాలను విడుదల చేస్తారు.
  • ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్: మూడో విడతలో సీట్లు పొందిన అభ్యర్థులు జూన్ 20 నుండి జూన్ 25 మధ్యలో ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది.

1. TS DOST అధికారిక వెబ్‌సైట్ https://dost.cgg.gov.in/ ను సందర్శించండి.

2. హోం పేజీలో అందుబాటులో ఉన్న TS DOST 2026 రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.

3. ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది, అక్కడ అభ్యర్థులు తమను తాము నమోదు చేసుకోవాలి.

4. నమోదు పూర్తయిన తర్వాత, దరఖాస్తు పత్రాన్ని పూరించండి.

5. దరఖాస్తు రుసుము చెల్లించండి.

6. సబ్మిట్ పై క్లిక్ చేసి పేజీని డౌన్‌లోడ్ చేసుకోండి.

7. తదుపరి అవసరం కోసం హార్డ్ కాపీని భద్రపరచుకోండి

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe