TG DOST Seat Allotment 2026 : దోస్త్ ప్రత్యేక విడత సీట్ల కేటాయింపు పూర్తి - అలాట్ మెంట్ లింక్, రిపోర్టింగ్ తేదీలు ఇవే!

TG DOST Special Phase Allotment 2026 : దోస్త్ ప్రత్యేక విడత డిగ్రీ సీట్లను కేటాయించారు. సీటు పొందిన విద్యార్థులు ఆగస్టు 01, 2026 వరకు ఆన్‌లైన్ పద్ధతిలో సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాలి. 

Published on: Jul 31, 2026, 09:17:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

TG DOST Special Phase Allotment 2026 : దోస్త్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ కు సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. అర్హులైన అభ్యర్థులకు సీట్లను కేటాయించారు. ఈ విడతలో మొత్తం 53,967 మంది విద్యార్థులకు సీట్లు లభించాయి.

దోస్త్ ప్రవేశాలు 2026
దోస్త్ ప్రవేశాలు 2026

ఈ ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌లో సీటు దక్కించుకున్న విద్యార్థులందరూ ఆగస్టు 01, 2026 వరకు ఆన్‌లైన్ పద్ధతిలో సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒరిజినల్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (TC)తో పాటు ఇతర అవసరమైన ధృవీకరణ పత్రాలను కేటాయించిన కళాశాలలో సమర్పించాలి. ఈ నిర్దేశిత గడువులోగా కళాశాలలో రిపోర్ట్ చేయని అభ్యర్థుల సీటు కేటాయింపు రద్దవుతుంది. అందువల్ల అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే తమ ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ స్పెషల్ ఫేజ్‌‌‌‌లో కేటాయించిన సీట్లలో బీకామ్‌‌‌‌లో 17,335 మంది, బీఎస్సీ (ఫిజికల్ సైన్స్)లో 10,894 మంది, బీఎస్సీ (లైఫ్ సైన్స్)లో 9,592 మంది, బీఏలో 9,073 మంది, బీబీఏలో 4,411 మంది, బీసీఏలో 1,734 మంది విద్యార్థులకు సీట్లు దక్కాయి.

దోస్త్ ప్రత్యేక విడత - అలాట్‌మెంట్ డౌన్లోడ్ ఇలా:

దోస్త్ ప్రత్యేక విడతలో సీటు పొందిన విద్యార్థులు తమ అడ్మిషన్ వివరాలు తెలుసుకోవడానికి, అలాట్‌మెంట్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి క్రింది ప్రక్రియను అనుసరించాలి.

  • మొదటగా విద్యార్థులు దోస్త్ అధికారిక వెబ్‌సైట్ https://dost.cgg.gov.in ను సందర్శించాలి.
  • మీ వద్ద ఉన్న దోస్త్ ఐడీ (DOST ID) మరియు పాస్‌వర్డ్ వివరాలను నమోదు చేసి సిస్టమ్‌లోకి లాగిన్ కావాలి.
  • లాగిన్ విజయవంతమైన తర్వాత, మీకు సీటు ఖరారైతే స్క్రీన్‌పై సీటు కేటాయింపు లెటర్ ప్రత్యక్షమవుతుంది.
  • స్క్రీన్‌పై కనిపిస్తున్న ప్రింట్ లేదా డౌన్‌లోడ్ ఆప్షన్‌ను ఎంచుకుని అలాట్‌మెంట్ ఆర్డర్ కాపీని సేవ్ చేసుకోవాలి.
  • కళాశాలలో నేరుగా చేరేటప్పుడు ఈ అలాట్‌మెంట్ లెటర్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి విద్యార్థులు ఈ ప్రింటవుట్ కాపీని భద్రంగా ఉంచుకోవాలని సూచించారు.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More