...
...
Next Story

TG EAPCET 2026 Counselling : ఇంజినీరింగ్ అభ్యర్థులకు అలర్ట్ - రిపోర్టింగ్ కు ఇవాళే చివరి తేదీ

TG EAPCET Counselling Seat Allotment : టీజీ ఈఏపీసెట్ 2026 ఇంజినీరింగ్ అభ్యర్థులకు మరో అప్డేట్. మొదటి విడతలో సీట్లు పొందిన విద్యార్థులు…సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ గడువు నేటితో(జూలై 14) ముగియనుంది.

Published on: Jul 14, 2026 12:09 PM IST
Advertisement

TG EAPCET Counselling Seat Allotment 2026 : తెలంగాణలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఈఏపీసెట్ -2026 మొదటి విడత కౌన్సిలింగ్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. మొదటి విడతలో తాత్కాలికంగా సీట్లు పొందిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి, అలాగే ట్యూషన్ ఫీజు చెల్లించడానికి విధించిన గడువు నేటితో (జూలై 14) ముగియనుంది. జూలై 10వ తేదీన ఉన్నత విద్యామండలి మొదటి విడత సీట్ల కేటాయింపు ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

రిపోర్టింగ్ తప్పనిసరి…

తెలంగాణ ఈఏపీసెట్ - 2026
తెలంగాణ ఈఏపీసెట్ - 2026

విద్యార్థులు తమకు కేటాయించిన సీటును ఖరారు చేసుకోవాలనుకుంటే… వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియను ఖచ్చితంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా ఫీజు చెల్లించని వారి, లేదా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని వారి సీట్లను ఆటోమేటిక్‌గా రద్దు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. మొదటి విడతలో సీటు నచ్చకపోయినా….. దానిని రిజర్వ్ చేసుకుని తదుపరి విడత కౌన్సిలింగ్‌కు వెళ్లాలనుకునే వారు కూడా ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడం తప్పనిసరి.

ఆన్‌లైన్ ప్రక్రియ ఎలా పూర్తి చేయాలి?

అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ అయిన tgeapcet.nic.in లో 'క్యాండిడేట్ లాగిన్' లింక్‌ను ఉపయోగించి తమ లాగిన్ ఐడీ, హాల్ టికెట్ నంబర్, పాస్‌వర్డ్ మరియు పుట్టిన తేదీ వివరాలతో లాగిన్ అవ్వాలి. అక్కడ కనిపిస్తున్న అలాట్‌మెంట్ ఆర్డర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, అందులో పేర్కొన్న ట్యూషన్ ఫీజును నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి.

ఫీజు చెల్లింపు అయిన తర్వాత స్క్రీన్‌పై కనిపించే 'యాక్సెప్ట్ మై జాయినింగ్' (Accept My Joining) ఆప్షన్‌ను ఎంచుకుని ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాలి. అనంతరం సిస్టమ్ జనరేట్ చేసే జాయినింగ్ రిపోర్ట్‌ను భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ తీసుకుని జాగ్రత్త పరచుకోవాలి. మొదటి విడతలో సీట్లు పొందిన వారు నేరుగా కళాశాలలకు వెళ్లి ఫిజికల్ రిపోర్టింగ్ చేయాల్సిన అవసరం లేదు…. కేవలం ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ సరిపోతుంది.

రెండో విడత కౌన్సిలింగ్ షెడ్యూల్

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe