TG ECET 2026 Counselling : తెలంగాణ ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - ఈనెల 15 నుంచి రిజిస్ట్రేషన్లు
TG ECET Counselling Schedule 2026 : తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాల కోసం నిర్వహించే TG ECET కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. జూన్ 15 నుండి మొదటి విడత రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి.
TG ECET Counselling Schedule 2026 : పాలిటెక్నిక్, డిప్లొమా పూర్తి చేసి, ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో నేరుగా ద్వితీయ సంవత్సరంలో (లేటరల్ ఎంట్రీ) ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులకు తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక అప్‌డేట్ ఇచ్చింది. ప్రవేశాల ప్రక్రియకు సంబంధించిన TG ECET (తెలంగాణ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది.

మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తి వివరాలు
అధికారిక షెడ్యూల్ ప్రకారం… మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 15వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా అర్హులైన విద్యార్థులు జూన్ 15 నుండి 18వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకుని, ప్రాసెస్సింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఫీజు చెల్లింపు పూర్తి చేసిన అభ్యర్థులకు జూన్ 17 నుంచి 19వ తేదీ వరకు విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన (Verification) నిర్వహిస్తారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ విజయవంతంగా పూర్తయిన అభ్యర్థులు జూన్ 21వ తేదీ వరకు తమకు నచ్చిన కాలేజీలు, కోర్సులను ప్రాధాన్యత క్రమంలో ఎంచుకోవడానికి ‘వెబ్ ఆప్షన్లు’ నమోదు చేసుకోవచ్చు.
జూన్ 24న సీట్ల కేటాయింపు..
విద్యార్థులు నమోదు చేసుకున్న వెబ్ ఆప్షన్లు, వారి మెరిట్ ర్యాంక్ మరియు రిజర్వేషన్ల ఆధారంగా జూన్ 24న మొదటి విడత కాలేజీ సీట్లను అధికారులు కేటాయిస్తారు. ఒకవేళ మొదటి విడతలో సీటు రాని వారు లేదా లభించిన కాలేజీ కంటే మెరుగైన కాలేజీని ఆశించే వారి కోసం జులై 4వ... తేదీ నుంచి రెండో దశ (సెకండ్ ఫేజ్) కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. అభ్యర్థులు తాజా సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను నిరంతరం పరిశీలించాలని అధికారులు సూచించారు.
టీజీ ఈసెట్ 2026 - ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ ఇలా :
- టీజీ ఈసెట్ అధికారిక వెబ్‌సైట్ http://ecet.tsche.ac.in/ ను సందర్శించాలి.
- హోం పేజీలో కనిపించే 'Download Rank Card'' లింక్‌పై క్లిక్ చేయాలి.
- ఓపెన్ అయిన కొత్త విండోలో అభ్యర్థి తన ఈసెట్ హాల్ టికెట్ నంబర్ (Hall Ticket Number), రిజిస్ట్రేషన్ నంబర్ , పుట్టిన తేదీ (Date of Birth) వివరాలను నమోదు చేయాలి.
- వివరాలన్నీ సరిచూసుకుని 'View Rank Card' పై క్లిక్ చేయగానే మీ ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
- కౌన్సెలింగ్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కోసం ఈ ర్యాంక్ కార్డును ప్రింట్‌అవుట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

