TG EdCET 2026 Hall Ticket Download: రాష్ట్రంలోని బీఈడీ (B.Ed) కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ ఎడ్‌సెట్ 2026 పరీక్షకు సర్వం సిద్ధమైంది. తాజాగా ఈ ఈ ఎంట్రెన్స్ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. అధికారిక వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటంది.

మే 12న జరగనున్న ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ బీఈడీ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ అడ్మిషన్లు కల్పిస్తారు. మే 12న ఉదయం 10:00 నుండి 12:00 వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2:00 నుంచి 4:00 వరకు మరో సెషన్ ఉంటుంది.
టీజీ ఎడ్ సెట్ ప్రాథమిక కీ మే 15న విడుదల కానుంది. వీటిపై అభ్యంతరాలను కూడా స్వీకరిస్తారు. మే 30న తుది ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది.
టీజీ ఎడ్‌సెట్ 2026 హాల్ టికెట్ : డౌన్లోడ్ ఎలా చేయాలి?
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ edcet.tgche.ac.in ను సందర్శించండి.
- హోమ్ పేజీలో ఉన్న 'Download Hall Ticket' లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ రిజిస్ట్రేషన్ నంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ (DOB) వివరాలను నమోదు చేయండి.
- 'గెట్ హాల్ టికెట్' పై క్లిక్ చేయగానే మీ హాల్ టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- దానిని ప్రింట్ తీసుకుని పరీక్షా కేంద్రానికి తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి.
హాల్ టికెట్‌తో పాటు అభ్యర్థులు తప్పనిసరిగా ఒక చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలి. పరీక్షా కేంద్రానికి కనీసం గంటన్నర ముందుగానే వెళ్లటం ఉత్తమం. హాల్ టికెట్‌పై ఉన్న మీ పేరు, ఫోటో, సంతకం మరియు పరీక్షా కేంద్రం వివరాలను సరిచూసుకోవాలి. ఏవైనా తప్పులు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి.
ఈసారి కూడా ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్షను కాకతీయ యూనివర్శిటీ నిర్వహించనుంది. ఎంట్రెన్స్ పరీక్షలో అభ్యర్థులు సాధించే ర్యాంకుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. రిజర్వేషన్లను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహణ తర్వాత ఫలితాలను ప్రకటిస్తారు. ఆ తర్వాత కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టి… సీట్లను భర్తీ చేస్తారు. కౌన్సెలింగ్ ఫేజ్ లు పూర్తి అయి సీట్లు మిగిలితే… స్పాట్ అడ్మిషన్లపై నిర్ణయం తీసుకుంటారు.
{{/usCountry}}ఈసారి కూడా ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్షను కాకతీయ యూనివర్శిటీ నిర్వహించనుంది. ఎంట్రెన్స్ పరీక్షలో అభ్యర్థులు సాధించే ర్యాంకుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. రిజర్వేషన్లను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహణ తర్వాత ఫలితాలను ప్రకటిస్తారు. ఆ తర్వాత కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టి… సీట్లను భర్తీ చేస్తారు. కౌన్సెలింగ్ ఫేజ్ లు పూర్తి అయి సీట్లు మిగిలితే… స్పాట్ అడ్మిషన్లపై నిర్ణయం తీసుకుంటారు.
{{/usCountry}}