తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీస్‌లో ఖాళీగా ఉన్న 60 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాత పరీక్ష పూర్తి కాగా…తాజాగా ఇందుకు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి.
ఫలితాలను ఇలా చేసుకోండి…
- అభ్యర్థులు ముందుగా https://www.tgprb.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలో FSL (Technical Posts) Recruitment 2025 ఆప్షన్ ఉంటుంది.
- ఇక్కడ సెలెక్టెడ్ క్యాండెట్స్ ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేస్తే ఎంపికైన అభ్యర్థుల పేర్లు కనిపిస్తాయి
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా కాపీని పొందాలి.

{{^htLoading}} {{/htLoading}}
ఇందుకు సంబంధించిన రాత పరీక్షలను మార్చి 5, 6,7 తేదీల్లో నిర్వహించారు. ప్రతిరోజూ మూడు సెషన్లలో ఈ పరీక్షలు జరిగాయి. ఇందులో మెరిట్ సాధించిన అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేశారు.
ఈనెల 23 నుంచి అటెస్టేషన్:
TG FSLలో వివిధ పోస్టులకు నిర్వహించిన రాతపరీక్షలో ఎంపికైన అభ్యర్ధులకు అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. మార్చి 23వ తేదీ నుంచి 25వ తేదీలోగా డిజిటల్ అటెస్టేషన్ పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వివరాలకు http://tgprb.in ను సందర్శించాలని సూచించారు.
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}