మద్దతు ధరతోపాటుగా బోనస్ చెల్లింపులకు ప్రభుత్వం సిద్ధం.. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఉత్తమ్

ధాన్యం దిగుబడిలో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ సాధించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ వానాకాలంలో రికార్డ్ స్థాయిలో 148.03 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందని వెల్లడించారు.

Updated on: Oct 15, 2025 4:43 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సచివాలయంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు.. ఖరీఫ్ ధాన్యం సేకరణపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యవసాయ కార్యదర్శి కె. సురేంద్ర మోహన్, పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు.

సమీక్షలో మంత్రులు ఉత్తమ్, తుమ్మల
సమీక్షలో మంత్రులు ఉత్తమ్, తుమ్మల

వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో మాట్లాడారు. ధాన్యం దిగుబడిలో తెలంగాణలో రికార్డు సృష్టించిదని, రికార్డు స్థాయిలో 148.03 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందన్నారు. ధాన్యం అధిక దిగుబడి, అధిక కొనుగోళ్ల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

'ధాన్యం కొనుగోలులో గత అనుభవాలు దృష్టిలో పెట్టుకోవాలి. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు కనీస సౌకర్యాలు కల్పించాలి. కొనుగోలు చేసిన తర్వాత ధాన్యాన్ని తరలించడానికి ఏర్పాటు చేసిన రవాణా వసతిపై ప్రత్యేకంగా ఫోకస్ చేయాలి. రైతులకు ఎక్కడ కూడా నిరీక్షించకుండా చర్యలు తీసుకోవాలి. మౌలిక సదుపాయాల కల్పన అంశంలో అత్యవసరం అనుకుంటే అదనపు ఖర్చుకు వెనకాడొద్దు.' అని మంత్రి ఉత్తమ్ తెలిపారు.

ధాన్యం కొనుగోలు వివరాలను వెంటనే నమోదు చేయాలని మంత్రి ఉత్తమ్ అన్నారు. నమోదైన కొనుగోళ్లకు 48 గంటలలో చెల్లింపులు జరగాలన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో మిల్లర్లతో సమన్వయం చేసుకోవాలన్నారు. కలెక్టర్స్ అందరూ సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. మద్దతు ధరతోపాటుగా బోనస్ చెల్లింపులకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

'తెలంగాణ రికార్డు స్థాయిలో 148.03 LMT వరి దిగుబడిని నమోదు చేసింది. దేశంలోనే అత్యధికం. ఈ ఖరీఫ్‌లో సేకరణలో కొత్త రికార్డు. అధిక దిగుబడి నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. రైతులకు ప్రాథమిక సౌకర్యాలు, త్వరిత చెల్లింపులు ఉండేలా చూసుకోండి. రవాణా, మిల్లర్ సమన్వయంపై దృష్టి పెట్టండి. MSPకి అదనంగా బోనస్ చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వేగవంతమైన సేకరణలో తెలంగాణ ముందుంది. మాది రైతు అనుకూల ప్రభుత్వం' అని మంత్రి ఉత్తమ్ అన్నారు.

కలెక్టర్లు, అధికారులు ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా చూసుకోవాలని మంత్రి ఉత్తమ్ అన్నారు. ఎప్పుడైనా తనను, పౌర సరఫరాల కమిషనర్‌ను సంప్రదించొచ్చని తెలిపారు. 24×7 అందుబాటులో ఉంటామని చెప్పారు.

News/Telangana/మద్దతు ధరతోపాటుగా బోనస్ చెల్లింపులకు ప్రభుత్వం సిద్ధం.. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఉత్తమ్
News/Telangana/మద్దతు ధరతోపాటుగా బోనస్ చెల్లింపులకు ప్రభుత్వం సిద్ధం.. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఉత్తమ్