రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తుల ప్రక్రియ చేపట్టగా… ఈ గడువు జనవరి 21వ తేదీతో ముగిసింది. అయితే అధికారులు మరో అవకాశం కల్పించారు. దరఖాస్తుల గడువును ఈనెల 25వ తేదీ వరకు పొడిగించారు. అర్హత ఉన్న విద్యార్థులు వెంటనే అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని సూచించారు.

టీజీ గురుకుల సెట్ ద్వారా 2026-27 విద్యా సంవత్సరం కింద ఐదో తరగతిలో ప్రవేశాలు ((TGSWREIS, TGTWREIS, MJPTBCWREIS,TGREIS) కల్పిస్తారు. ప్రస్తుతం నాల్గో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ రాసేందుకు అర్హులవుతారు.ప్రభుత్వ ఆధ్వర్యంలోని 4 గురుకుల సొసైటీలలో ఈ ఎంట్రెన్స్ ద్వారానే అడ్మిషన్లను పూర్తి చేస్తారు. అంతేకాకుండా 6, 7, 8, 9వ తరగతుల్లోని బ్యాక్‌లాగ్ సీట్లను కూడా ఈ ఎంట్రెన్స్ ద్వారానే భర్తీ చేస్తారు.
ఇప్పటివరకు 1.40లక్షలకుపైగా దరఖాస్తులు అందాయి. అయితే గడువు పెంపుపై అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరగణనలోకి తీసుకున్న అధికారులు… పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు వినియోగించుకుకోవాలని సూచించారు. మరోవైపు జనవరి 25 సాయంత్రం 5 గంటల వరకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని అధికారులు వెల్లడించారు.
టీజీ గురుకుల సెట్ - 2026 పరీక్షను ఫిబ్రవరి 22వ తేదీన నిర్వహిస్తారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంది. అన్ని జిల్లాల్లోని నిర్ణీత పరీక్షా కేంద్రాల్లో కొనసాగే ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఫీజు రూ.100గా నిర్ణయించారు.
TGCET 2026 - దరఖాస్తు విధానం….
- ముందుగా https://tgcet.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- క్లిక్ ఇయర్ ఫర్ ఇంపార్టెంట్ లింక్స్ పై క్లిక్ చేయాలి.
- హోం పేజీలోని పేమెంట్ లింక్ పై క్లిక్ చేసి నిర్ణయించిన ఫీజును చెల్లించాలి.
- ఆ తర్వాత హోంపేజీలో కనిపించే అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ పేమెంట్ వివరాలు, పేమెంట్ చేసిన తేదీ, దరఖాస్తు చేసుకునే అభ్యర్థి పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
- సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ పూర్తి వివరాలను నమోదు చేయటంతో పాటు ఫొటోను అప్ లోడ్ చేయాలి.
- చివరగా సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి రిజిస్ట్రేషన్ కాపీని పొందవచ్చు
- హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే సమయంలో రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలి. కాబట్టి జాగ్రత్తగా ఉంచుకోవాలి.
టీజీ గురుకుల సెట్ - 2026కు దరఖాస్తు చేసుకునేందుకు ముఖ్యమైన పత్రాలు ఉండాల్సి ఉంటుంది. కుల ధ్రువీకరణ, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు వివరాలు, జనన ధ్రువీకరణ పత్రం ఉండాలి. పాస్పోర్ట్ సైజ్ ఫొటో, మొబైల్ నెంబర్ వివరాలు అవసరమవుతాయి.
{{/usCountry}}టీజీ గురుకుల సెట్ - 2026కు దరఖాస్తు చేసుకునేందుకు ముఖ్యమైన పత్రాలు ఉండాల్సి ఉంటుంది. కుల ధ్రువీకరణ, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు వివరాలు, జనన ధ్రువీకరణ పత్రం ఉండాలి. పాస్పోర్ట్ సైజ్ ఫొటో, మొబైల్ నెంబర్ వివరాలు అవసరమవుతాయి.
{{/usCountry}}