TG Gurukul CET 2026 : తెలంగాణ గురుకులాల్లో అడ్మిషన్లు - దరఖాస్తులకు మరికొన్ని గంటలే గడవు

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు ఇవాళ్టితో (జనవరి 21) ముగియనుంది. అర్హులైన విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Published on: Jan 21, 2026 7:27 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఈ గడువు ఇవాళ్టితో పూర్తి కానుంది. మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండటంతో… అర్హత ఉన్న విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

తెలంగాణ గురుకులాల్లో అడ్మిషన్లు
తెలంగాణ గురుకులాల్లో అడ్మిషన్లు

ఈ నోటిఫికేషన్ లో భాగంగా 2026-27 విద్యా సంవత్సరం కింద ఐదో తరగతిలో ప్రవేశాలు ((TGSWREIS, TGTWREIS, MJPTBCWREIS,TGREIS) కల్పిస్తారు. ప్రస్తుతం నాల్గో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ రాసేందుకు అర్హులవుతారు.ప్రభుత్వ ఆధ్వర్యంలోని 4 గురుకుల సొసైటీలలో ఈ ఎంట్రెన్స్ ద్వారానే అడ్మిషన్లను పూర్తి చేస్తారు.

ఈ ప్రవేశ పరీక్షను వచ్చే ఫిబ్రవరి 22వ తేదీన నిర్వహిస్తారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంది. అన్ని జిల్లాల్లోని నిర్ణీత పరీక్షా కేంద్రాల్లో కొనసాగే ఈ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ ఫీజు రూ.100గా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం ఆయా గురుకుల విద్యాలయ సంస్థల అధికారిక వెబ్‌సైట్‌( https://tgcet.cgg.gov.in )ను చూడొచ్చు.

TGCET 2026 - దరఖాస్తు విధానం….

  • ముందుగా https://tgcet.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • క్లిక్ ఇయర్ ఫర్ ఇంపార్టెంట్ లింక్స్ పై క్లిక్ చేయాలి.
  • హోం పేజీలోని పేమెంట్ లింక్ పై క్లిక్ చేసి నిర్ణయించిన ఫీజును చెల్లించాలి.
  • ఆ తర్వాత హోంపేజీలో కనిపించే అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ పేమెంట్ వివరాలు, పేమెంట్ చేసిన తేదీ, దరఖాస్తు చేసుకునే అభ్యర్థి పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
  • సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ పూర్తి వివరాలను నమోదు చేయటంతో పాటు ఫొటోను అప్ లోడ్ చేయాలి.
  • చివరగా సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి రిజిస్ట్రేషన్ కాపీని పొందవచ్చు
  • హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే సమయంలో రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలి. కాబట్టి జాగ్రత్తగా ఉంచుకోవాలి.

టీజీ గురుకుల సెట్ - 2026కు దరఖాస్తు చేసుకునేందుకు ముఖ్యమైన పత్రాలు ఉండాల్సి ఉంటుంది. కుల ధ్రువీకరణ, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు వివరాలు, జనన ధ్రువీకరణ పత్రం ఉండాలి. పాస్‌పోర్ట్ సైజ్‌ ఫొటో, మొబైల్‌ నెంబర్‌ వివరాలు అవసరమవుతాయి.