TGCET 2026 : తెలంగాణ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలు - ఎంట్రెన్స్ నోటిఫికేషన్ విడుదల, ఇలా అప్లయ్ చేసుకోండి

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశం కోసం ఉమ్మడి నోటిఫికేషన్‌ జారీ అయింది.2026-27 విద్యా సంవత్సరానికి గానూ అడ్మిషన్లు కల్పిస్తారు. నేటి నుంచి అప్లికేషన్లు ప్రారంభం కాగా… జనవరి 21వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

Published on: Dec 11, 2025, 17:48:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశం కోసం ఉమ్మడి నోటిఫికేషన్‌ జారీ అయింది. ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ షురూ అయింది. అర్హులైన విద్యార్థులు… వచ్చే జనవరి 21లోపు దరఖాస్తు చేసుకోవాలి.

గురుకుల ప్రవేశాల ప్రకటన - నోటిఫికేషన్ విడుదల
గురుకుల ప్రవేశాల ప్రకటన - నోటిఫికేషన్ విడుదల

ఈ నోటిఫికేషన్ లో భాగంగా 2026-27 విద్యా సంవత్సరం కింద ఐదో తరగతిలో ప్రవేశాలు ((TGSWREIS, TGTWREIS, MJPTBCWREIS,TGREIS) కల్పిస్తారు. ప్రస్తుతం నాల్గో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ రాసేందుకు అర్హులవుతారు.

ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఎప్పుడంటే..?

ప్రభుత్వ ఆధ్వర్యంలోని నాలుగు గురుకుల సొసైటీలలో ఈ ఎంట్రెన్స్ ద్వారానే అడ్మిషన్లను పూర్తి చేస్చారు. ప్రవేశ పరీక్షను వచ్చే ఫిబ్రవరి 22వ తేదీన నిర్వహిస్తారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంది.

అన్ని జిల్లాల్లోని నిర్ణీత పరీక్షా కేంద్రాల్లో కొనసాగే ఈ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ ఫీజు రూ.100గా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం ఆయా గురుకుల విద్యాలయ సంస్థల అధికారిక వెబ్‌సైట్‌( https://tgcet.cgg.gov.in )ను సందర్శించవచ్చు.

దరఖాస్తు విధానం….

  1. ముందుగా https://tgcet.cgg.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించాలి.
  2. హోం పేజీలోని పేమెంట్ లింక్ పై క్లిక్ చేసి నిర్ణయించిన ఫీజును చెల్లించాలి.
  3. ఆ తర్వాత అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ పేమెంట్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
  4. సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ పూర్తి వివరాలను నమోదు చేయటంతో పాటు ఫొటోను అప్ లోడ్ చేయాలి.
  5. చివరగా సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది.
  6. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి రిజిస్ట్రేషన్ కాపీని పొందవచ్చు
  7. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే సమయంలో రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలి. కాబట్టి జాగ్రత్తగా ఉంచుకోవాలి.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More