TG ICET Counseling Schedule : తెలంగాణ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - ఈనెల 31 నుంచి రిజిస్ట్రేషన్లు, పూర్తి వివరాలు
TG ICET Counseling Schedule 2026 : తెలంగాణలోని ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో సీట్ల భర్తీకి ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. జులై 31 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
TG ICET 2026 Counseling Schedule : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ఎంబీఏ , ఎంసీఏ కోర్సుల్లో సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 31వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభవుతాయి. రెండు విడతల్లో నిర్వహించే కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా కళాశాలల్లోని కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేస్తారు.

ఈనెల 31 నుంచి రిజిస్ట్రేషన్లు…
టీజీ ఐసెట్ మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 31న ప్రారంభమవుతుంది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 5వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు 5 వరకు సర్టిఫికెట్ల పరిశీలన (ధ్రువపత్రాల పరిశీలన) ఉంటుంది. ఆగస్టు 3 నుంచి 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు.
ఆగస్టు 11వ తేదీ లేదా అంతకంటే ముందే మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది.సీట్లు పొందే విద్యార్థులు…. ఆగస్టు 11 నుంచి 14వ తేదీ వరకు ఆయా కళాశాలల్లో ఫీజు చెల్లింపు, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.
ఆగస్ట్ 17 నుంచి తుది విడత కౌన్సెలింగ్…
ఇక తుది విడత కౌన్సెలింగ్ ఆగస్టు 17 నుంచి ప్రారంభమవుతుంది. ఆగస్టు 18న సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ఆగస్టు 18, 19 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఆగస్టు 22న లేదా అంతకన్నా ముందు తుది విడత సీట్లను కేటాయిస్తారు. సీటు పొందిన అభ్యర్థులు ఆగస్టు 22 నుంచి 25వ తేదీ మధ్య కేటాయించిన కళాశాలలో నేరుగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక మిగిలిపోయిన సీట్ల భర్తీకి సంబంధించి ఆగస్టు 24న స్పాట్ ప్రవేశాల మార్గదర్శకాలు జారీ అవుతాయని అధికారులు పేర్కొన్నారు.
ఈ ఏడాది నిర్వహించనున్న కౌన్సెలింగ్ ద్వారా మొత్తం 46,654 మంది విద్యార్థులు సీట్లు పొందే అవకాశం ఉంది. గత ఏడాది (2025-26) గణాంకాలను పరిశీలిస్తే…. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 287 ఎంబీఏ కళాశాలల్లో మొత్తం 40,601 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కన్వీనర్, 'బి' కేటగిరీ కలిపి మొత్తంగా 35,141 సీట్లు భర్తీ అయ్యాయి. మరోవైపు…. 80 ఎంసీఏ కళాశాలల్లో 9,360 సీట్లు అందుబాటులో ఉండగా… వాటిలో 5,420 సీట్లు నిండాయి.
టీజీ ఐసెట్ 2026 - తొలి విడత కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూల్
- జులై 31 నుంచి ఆగస్టు 5 వరకు : సర్టిఫికెట్ల పరిశీలన (ధ్రువపత్రాల పరిశీలన) కోసం ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్
- ఆగస్టు 1 నుంచి 5వ తేదీ వరకు : హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన
- ఆగస్టు 3 నుంచి 8వ తేదీ వరకు : కళాశాలల ఎంపిక కోసం వెబ్ ఆప్షన్ల నమోదు
- ఆగస్టు 11వ తేదీ లేదా అంతకంటే ముందు : మొదటి విడత సీట్ల కేటాయింపు
- ఆగస్టు 11 నుంచి 14వ తేదీ వరకు : కేటాయించిన కళాశాలల్లో ఫీజు చెల్లింపు, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్
- అధికారిక వెబ్ సైట్ - https://tgicet.nic.in
సర్టిఫికెట్ వెరిఫికెషన్ - కావాల్సిన పత్రాలు:
- TG ICET-2026 ర్యాంక్ కార్డు
- టీజీ ఐసెట్ హాల్ టికెట్
- ఆధార్ కార్డు
- టెన్త్ మెమో
- ఇంటర్, డిగ్రీ, మెమో
- స్టడీ సర్టిఫికెట్లు
- టీసీ
- ఆదాయ ధ్రువీకరణపత్రం
- ఈడబ్యూఎస్ అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్
- రెసిడెన్స్ సర్టిఫికెట్
- ఇతర పత్రాలు
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

