...
...
Next Story

TG ICET 2026 : టీజీ ఐసెట్ షెడ్యూల్ విడుదల - ముఖ్యమైన తేదీలివే

టీజీ ఐసెట్ - 2026 షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 12వ తేదీ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం కానున్నాయి. మే 13, 14వ తేదీన పరీక్షలను నిర్వహిస్తారు.

Published on: Jan 29, 2026 02:23 PM IST
Advertisement

రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఐసెట్ - 2026 షెడ్యూల్ విడుదలైంది. 2026- 2027 విద్యా సంవత్సరానికి గానూ అడ్మిషన్లు ఇస్తారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా నల్ల‌గొండ‌లోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష బాధ్యతలను చూడనుంది.

తెలంగాణ ఐసెట్ 2026
తెలంగాణ ఐసెట్ 2026

టీజీ ఐసెట్ - 2026 కు సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి 6వ తేదీన జారీ చేస్తారు. ఫిబ్రవరి 12 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభమవుతుంది. మార్చి 16 వరకు దరఖాస్తుల స్వీకరణకు అవకాశం ఉంటుంది.

టీజీ ఐసెట్ - 2026 రిజిస్ట్రేషన్ ఫీజు కింద జనరల్ విద్యార్థులు రూ.750, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.550 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. రాత పరీక్షలు మే 13, 14 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తారు. నోటిఫికేషన్ జారీలో పూర్తిస్థాయి వివరాలను అందుబాటులో ఉంచుతారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe