తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు 1,284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ - II పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సెలక్షన్ లిస్టును విడుదల చేసింది. ఈ పోస్టులకు 24,045 మంది దరఖాస్తు చేసుకున్నారు. 23,323 పరీక్ష రాశారు. అంతకుముందు మెరిట్ లిస్ట్ ప్రకటించగా.. తాజాగా సెలక్ట్ అయిన 1260 మంది ఫైనల్ సెలక్షన్ లిస్టును విడుదల చేశారు.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ఫైనల్ జాబితాను వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా సచివాలయంలోని ఆయన కార్యాలయంలో తాజాగా విడుదల చేశారు. ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంది.
స్పోర్ట్స్ కోటా సెలక్షన్ లిస్ట్ త్వరలో విడుదల కానుంది. ఇందులో 18 పోస్టులు ఉన్నాయి. స్పోర్ట్స్ కోటా కింద ఎంపికైన వారి పేర్లను ప్రత్యేకంగా విడుదల చేస్తారు. మరోవైపు వికలాంగుల కోటాలో 2 పోస్టులు దరఖాస్తుదారులు లేరు. దీంతో ఆ 2 పోస్టులు ఖాళీగా మిగిలినట్టుగా బోర్డు పేర్కొంది. దివ్యాంగుల కేటగిరీకి సంబంధించిన కేసు హైకోర్టులో కొనసాగుతుంది.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసి.. తాజాగా బోర్డు 1260 మందితో ఫైనల్ లిస్టులను ప్రకటించింది. బోధనాస్పత్రులు, జిల్లా/ఏరియా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రుల్లో ఖాళీలను భర్తి చేస్తున్నారు.
ఈ లింక్ క్లిక్ చేసి ఎంపికైనవారి పేర్లు చూడవచ్చు
కిందడి ఏడాది సెప్టెంబర్ 11న ప్రభుత్వం గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. తర్వాత నవంబర్ 10వ తేదీన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరిగింది. పరీక్ష ఫలితాల ఆధారంగా అభ్యర్థుల ప్రొవిజనల్ మెరిట్ జాబితాను ప్రకటనకు బోర్డు పలు దశల్లో పరిశీలన చేసింది. ఇందులో కొందరు ఒప్పంద ఉద్యోగులు కూడా ఉన్నారు. వారి పని అనుభవానికి సంబంధించిన సర్టిఫికెట్లను జాగ్రత్తగా పరిశీలించారు. ఫేక్ సర్టిఫికేట్లు సమర్పించారని గుర్తించడంతో జిల్లాల డీఎంహెచ్‍ఓలకు దర్యాప్తు కోసం పంపారు.
ఆ తర్వాత ఆగస్టు 7న మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసింది. తాజాగా ఫైనల్ సెలక్షన్ లిస్టును విడుదల చేసింది.
{{/usCountry}}ఆ తర్వాత ఆగస్టు 7న మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసింది. తాజాగా ఫైనల్ సెలక్షన్ లిస్టును విడుదల చేసింది.
{{/usCountry}}