TG LAWCET 2026 : తెలంగాణ లాసెట్ నోటిఫికేషన్ విడుదల - ఈనెల 10 నుంచి దరఖాస్తులు ప్రారంభం

టీజీ లాసెట్ - 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఈనెల 10 నుంచి ప్రారంభమవుతుంది. మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సులతో పాటు పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మే 18వ తేదీన ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు.

Published on: Feb 08, 2026 7:05 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలోని న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ లాసెట్ - 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా 2026- 2027 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాలు కల్పిస్తారు. ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఈనెల 10వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.

టీజీ లాసెట్ 2026 దరఖాస్తులు
టీజీ లాసెట్ 2026 దరఖాస్తులు

ఇంటర్‌ విద్యార్హతతో 5 ఏళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు, డిగ్రీ విద్యార్హతపై మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌బీ పూర్తయిన వారికి రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. టీజీ లాసెట్ - 2026లో అభ్యర్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది.

టీజీ లాసెట్ 2026 - ముఖ్యమైన తేదీలు…

టీజీ లాసెట్ - 2026కు ఎలాంటి ఫైన్ లేకుండా ఏప్రిల్ 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 13వ తేదీ వరకు ఫైన్ తో దరఖాస్తుకు అవకాశం కల్పించారు. అప్లికేషన్ ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 900, జనరల్ అభ్యర్థులు రూ. 1100 చెల్లించాలి. TG PGLCETకు అప్లయ్ చేసుకునే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్ఖులు రూ. 900, జనరల్ అభ్యర్థులు రూ. 1100 చెల్లించాలి.

మే 18వ తేదీన మూడేళ్ల ఎల్ఎల్ బీ ఎంట్రెన్స్ పరీక్ష ఉంటుంది. ఉదయం 09. 30 గంటల నుంచి 11 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మరో సెషన్ ఉంటుంది.

ఇక ఎల్ఎల్ బీ ఐదేళ్ల కోర్సుతో పాటు ఎల్ఎల్ఎం ఎంట్రెన్స్ పరీక్షను సాయంత్రం 4 గంటల నుంచి 05.30 గంటల మధ్య నిర్వహిస్తారు. పూర్తిస్థాయి https://lawcet.tgche.ac.in/ వెబ్ సైట్ లో పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ కూడా పూర్తి చేసుకోవచ్చు.

  • ఎంట్రెన్స్ పరీక్ష - తెలంగాణ లాసెట్ 2026
  • ఆన్ లైన్ దరఖాస్తులు - 10 ఫిబ్రవరి 2026
  • ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ - 1 ఏప్రిల్ 2026
  • రూ. 500 ఫైన్ తో దరఖాస్తులకు చివరి తేదీ - 15-04-2026.
  • రూ.1000 ఫైన్ తో చివరి తేదీ - 25-04-2026.
  • రూ. 2000 ఫైన్ తో అప్లికేషన్లకు చివరి తేదీ - 05-05-2026.
  • రూ.4000 ఫైన్ తో దరఖాస్తులకు చివరి తేదీ - 10-.05-2026.
  • రూ.10000 ఆలస్య రుసుంతో చివరి తేదీ - 13-05-2026
  • అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ - 03-05-2026 నుంచి 08-05-2026.
  • హాల్ టికెట్ డౌన్లోడ్ - 12-05-2026
  • పరీక్ష తేదీ - 18-05-2026
  • ప్రాథమి కీలు విడుదల - 23-05-2026
  • అభ్యంతరాల స్వీకరణ - 25-05-2026
  • ఫలితాలు ప్రకటించే తేదీ - 05-06-2026
  • అధికారిక వెబ్ సైట్ - https://lawcet.tgche.ac.in/

టీజీ లాసెట్ పరీక్షను మొత్తం 120 మార్కులకు నిర్వహిస్తారు. ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. విడతల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టి సీట్లను భర్తీ చేస్తారు. కౌన్సెలింగ్ పూర్తి అయిన తర్వాత కూడా సీట్లు మిగిలితే స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలను ప్రకటిస్తారు. గత కొంతకాలంగా లా కోర్సులకు మంచి డిమాండ్ ఉంటోంది. సీట్ల కోసం చాలా మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More