...
...
Next Story

TG POLYCET Counselling : టీజీ పాలిసెట్ అభ్యర్థులకు అలర్ట్ - నేటి నుంచే కౌన్సెలింగ్ ప్రారంభం, రిజిస్ట్రేషన్ లింక్ ఇదే

TG Polycet 2026 Counselling : ఇవాళ్టి నుంచి తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్ షురూ కానుంది. https://tgpolycet.nic.in వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. జూన్ 9 నుంచి పాలిటెక్నిక్ కొత్త విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి.

Published on: May 27, 2026, 06:02:20 IST
Advertisement

TG Polycet 2026 Counselling : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కౌన్సెలింగ్ పై కీలక అప్డేట్ వచ్చేసింది. ఇవాళ్టి(మే 27 ) నుంచి మొదటి విడత కౌన్సెలింగ్ అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రవేశాల కమిటీ సమగ్ర షెడ్యూల్‌ను విడుదల చేసింది.

టీజీ పాలిసెట్ అభ్యర్థులకు అలర్ట్
టీజీ పాలిసెట్ అభ్యర్థులకు అలర్ట్

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 59 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్‌ (EWS) కోటాతో కలిపి మొత్తం 18,788 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది ప్రభుత్వ కళాశాలల్లో కొత్తగా 4,200 సీట్లు పెరిగాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఈసారి కొత్తగా 10 రకాల అత్యాధునిక కోర్సులను ప్రవేశపెట్టినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు 52 ప్రైవేట్‌ పాలిటెక్నిక్ కళాశాలల్లో 14,352 సీట్లు అందుబాటులో ఉన్నట్లు సాంకేతిక విద్యాశాఖ పేర్కొంది.

టీజీ పాలిసెట్ 2026 - కౌన్సెలింగ్ ముఖ్యమైన తేదీలు:

టీజీ పాలిసెట్ ఉత్తీర్ణులైన విద్యార్థుల కోసం ఇవాళ్టి నుంచి జూన్ మొదటి వారం వరకు మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుంది. ముఖ్యమైన తేదీలను ఇక్కడ తెలుసుకోండి…

  • మే 27 నుంచి 31 వరకు: అభ్యర్థులు ఆన్‌లైన్( https://tgpolycet.nic.in ) వేదికగా ప్రాసెస్ ఫీజు చెల్లించి, తమ ధ్రువపత్రాల పరిశీలన (సర్టిఫికెట్ వెరిఫికేషన్) కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • మే 29 నుంచి జూన్ 1 వరకు : విద్యార్థులు బుక్ చేసుకున్న స్లాట్ ప్రకారం నిర్దేశిత హెల్ప్‌లైన్ కేంద్రాలలో ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది.
  • మే 29 నుంచి జూన్ 3 వరకు : సర్టిఫికెట్ వెరిఫికేషన్ విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులు తమకు నచ్చిన కళాశాలలు, కోర్సుల ప్రాధాన్యత క్రమాన్ని ఎంచుకోవడానికి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.
  • జూన్ 6న: అభ్యర్థుల మెరిట్ ర్యాంకు, రిజర్వేషన్ల ఆధారంగా మొదటి విడత సీట్ల కేటాయింపు (సీట్ అలాట్‌మెంట్) చేపడతారు.
  • జూన్ 6 నుంచి 9 వరకు: సీటు పొందిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నిర్ణీత ట్యూషన్ ఫీజు చెల్లించి, వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి.
  • జూన్ 8 మరియు 9 తేదీల్లో: విద్యార్థులు తమకు సీటు వచ్చిన పాలిటెక్నిక్ కళాశాలలకు నేరుగా వెళ్లి, ఒరిజినల్ సర్టిఫికెట్లను సమర్పించి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
  • జూన్ 9న : రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ ప్రథమ సంవత్సరం కొత్త విద్యా సంవత్సరం (తరగతులు) ప్రారంభమవుతుంది.
  • అధికారిక వెబ్ సైట్ - https://tgpolycet.nic.in/Default.aspx

ఆ తర్వాత కూడా విద్యార్థులకు అంతర్గత మార్పుల కోసం జూన్ 27 నుంచి జూన్ 30 వరకు ఇంటర్నల్ స్లైడింగ్ (Internal Sliding) అవకాశం కల్పించారు. దీని ద్వారా విద్యార్థులు తాము చేరిన కళాశాలలోనే ఒక బ్రాంచ్ నుంచి (ఉదాహరణకు మెకానికల్ బ్రాంచ్ నుంచి కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌కు) మారడానికి వీలుంటుంది.

ఇక ఈ ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాత కూడా మిగిలిపోయే సీట్లను భర్తీ చేయడానికి జూలై 1 నుంచి జూలై 8వ తేదీల మధ్య స్పాట్ ప్రవేశాలు (Spot Admissions) నిర్వహించాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది.

ఇటీవలనే తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ పాలిసెట్) 2026 ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే . మెుత్తం 82.94 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 86.38 శాతం, బాలురు 79.92 శాతంగా ఉత్తీర్ణత సాధించారు.

పాలిసెట్ 2026 ఎంపీసీ స్ట్రీమ్‌లో మొత్తం 98,029 మంది అభ్యర్థులు హాజరు కాగా, 81,307 మంది (82.94 శాతం) అర్హత సాధించారు. MBiPC స్ట్రీమ్‌లో 98,029 మంది విద్యార్థులు హాజరు కాగా, 79,652 మంది (81.25 శాతం) అర్హత పొందారు.

టీజీ పాలిసెట్ ఫలితాలు 2026 ఎలా చెక్ చేసుకోవాలి?

  • అధికారిక వెబ్‌సైట్ polycet.sbtet.telangana.gov.in ఓపెన్ చేయండి.
  • హోం పేజీలో కనిపించే TS POLYCET 2026 Rank Card లింక్‌పై క్లిక్ చేయండి.
  • మీ హాల్ టికెట్ నంబర్ (Hall Ticket Number), పుట్టిన తేదీ (Date of Birth) ఎంటర్ చేయండి.
  • వివరాలు సరిచూసుకుని సబ్మిట్ పై క్లిక్ చేయగానే మీ ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
  • కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసే వరకు ర్యాంక్ కార్డ్ అవసరం. దీనిని ప్రింట్అవుట్ తీసుకుని భద్రపరుచుకోండి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe