TG POLYCET Hall Ticket 2026 : రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘పాలిసెట్-2026’కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటిని అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఈ ప్రవేశ పరీక్ష ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు. ఎంట్రెన్స్ పరీక్షను మే 13వ తేదీన నిర్వహిస్తారు. పరీక్ష నిర్వహించిన 12 రోజుల తర్వాత ఫలితాలను ప్రకటిస్తారు. ఏమైనా సందేహాలు ఉంటే 08031404549 ఫోన్ నెంబర్ లేదా te@telangana.gov.in, మెయిల్ ను సంప్రదింవచ్చు.
టీజీ పాలిసెట్ పరీక్షను మొత్తం 120 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్ (60), ఫిజిక్స్ (30), కెమిస్ట్రీ (30) నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 2 గంటల 30 నిమిషాలుగా ఉంటుంది. 10వ తరగతి (SSC) సిలబస్ ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి మరియు నెగిటివ్ మార్కులు ఉండవు.
టీజీ పాలిసెట్ హాల్ టికెట్ - డౌన్లోడ్ ఇలా:
- విద్యార్థులు https://www.polycet.sbtet.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోమ్ పేజీలో కనిపించే 'Hall Ticket' లింక్‌పై క్లిక్ చేయాలి.
- మీ రిజిస్ట్రేషన్ నెంబర్, మొబైల్ నెంబర్ వివరాలను నమోదు చేయాలి.
- సబ్మిట్ చేస్తే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా హాల్ టికెట్ కాపీని పొందొచ్చు.
పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్‌తో పాటు ఏదైనా ఒక ఒరిజినల్ గుర్తింపు కార్డును వెంట ఉంచుకోవాలి. పరీక్షా సమయానికి కనీసం గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. హాల్ టికెట్‌పై ఉన్న ఫోటో స్పష్టంగా లేకపోతే, గెజిటెడ్ అధికారితో ధృువీకరించిన ఫోటోను వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుంది.
{{/usCountry}}పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్‌తో పాటు ఏదైనా ఒక ఒరిజినల్ గుర్తింపు కార్డును వెంట ఉంచుకోవాలి. పరీక్షా సమయానికి కనీసం గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. హాల్ టికెట్‌పై ఉన్న ఫోటో స్పష్టంగా లేకపోతే, గెజిటెడ్ అధికారితో ధృువీకరించిన ఫోటోను వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుంది.
{{/usCountry}}