రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ -2026 ఎంట్రెన్స్ పరీక్షపై కీలక అప్డేట్ వచ్చేసింది. ఇటీవలే షెడ్యూల్ విడుదలకాగా.. తాజాగా ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. టెన్త్ పాస్ అయిన వారితో పాటు ప్రస్తుతం పరీక్షలు రాసే విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాసేందుకు అర్హులవుతారు.

రాష్ట్రంలో పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలకు సీట్ల భర్తీకి ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఇంజినీరింగ్, ఇతర వృత్తివిద్యాకోర్సులకు గతేడాది ప్రభుత్వం జారీచేసిన నిబంధనల మాదిరిగానే పాలిటెక్నిక్ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే కేటాయించనున్నారు.
ముఖ్యమైన తేదీలు…
అర్హులైన విద్యార్థులు ఏప్రిల్ 20వ తేదీలోపు అప్లికేషన్ చేసుకోవాలి. జనరల్ విద్యార్థులు రూ. 500 ఫీజు చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అయితే రూ. 250గా నిర్ణయించారు. గడువు దాటితే నిర్ణయించిన ఫీజుతో పాటు రూ. 100 ఫైన్ తో ఏప్రిల్ 21వ తేదీ వరకు, రూ. 300 తాత్కల్ ఫీజుతో ఏప్రిల్ 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఫీజు చెల్లింపు, దరఖాస్తు ప్రాసెస్ కోసం https://www.polycet.sbtet.telangana.gov.in వెబ్ సైట్ ను సంప్రదించాలి.
టీజీ పాలిసెట్ - 2026 పరీక్షను మే 13వ తేదీన నిర్వహిస్తారు. పరీక్ష నిర్వహించిన 12 రోజుల తర్వాత ఫలితాలను ప్రకటిస్తారు. ఏమైనా సందేహాలు ఉంటే 08031404549 ఫోన్ నెంబర్ లేదా te@telangana.gov.in, మెయిల్ ను సంప్రదింవచ్చు.
4 నుంచి 10వ తరగతి వరకు ఏడేళ్లలో నాలుగేళ్లు ఇక్కడ చదివితే లోకల్‌గా పరిగణిస్తారు. నాన్‌లోకల్ కోటా కింద.. పదేళ్లపాటు రాష్ట్రంలో నివసించిన వారి పిల్లలకు ఇతర రాష్ట్రాలకు చెందిన, తెలంగాణలో ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలకు కేటాయిస్తారు.
టీజీ పాలిసెట్ పరీక్షను మొత్తం 120 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్ (60), ఫిజిక్స్ (30), కెమిస్ట్రీ (30) నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 2 గంటల 30 నిమిషాలుగా ఉంటుంది. 10వ తరగతి (SSC) సిలబస్ ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి మరియు నెగిటివ్ మార్కులు ఉండవు.
{{/usCountry}}టీజీ పాలిసెట్ పరీక్షను మొత్తం 120 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్ (60), ఫిజిక్స్ (30), కెమిస్ట్రీ (30) నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 2 గంటల 30 నిమిషాలుగా ఉంటుంది. 10వ తరగతి (SSC) సిలబస్ ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి మరియు నెగిటివ్ మార్కులు ఉండవు.
{{/usCountry}}టీజీ పాలిసెట్ పరీక్ష నిర్వహణ తర్వాత ప్రాథమిక కీని విడుదల చేస్తారు. ఆ తర్వాత ఫలితాలను ప్రకటిస్తారు. ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో వచ్చే ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. విడతల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించి….సీట్లను భర్తీ చేస్తారు. కౌన్సెలింగ్ ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత కూడా సీట్లు మిగిలితే… స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలను విడుదల చేస్తారు.