తెలంగాణ సెట్(TS SET-2025) నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది టీఎస్ సెట్ ను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అక్టోబర్ 30వ తేదీ వరకు ఎలాంటి ఫైన్ లేకుండా అప్లయ్ చేసుకోవచ్చు.

{{^htLoading}} {{/htLoading}}
టీజీ సెట్ -2025ను రెండు పేపర్లలో నిర్వహిస్తారు. పేపర్-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులతో నిర్వహిస్తారు. కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో మూడు గంటల పాటు పరీక్ష నిర్వహించనున్నారు. టీఎస్ సెట్ నోటిఫికేషన్‌తో పాటు ఇతర సమాచారం కోసం http://telanganaset.org/ వెబ్ సైట్ ను చూడొచ్చు.
ముఖ్యమైన వివరాలు:
- సెట్ పరీక్ష రాసేందుకు ఎలాంటి గరిష్ఠ వయోపరిమితి లేదు.
- కంప్యూటర్ ఆధారిత టెస్టు (సీబీటీ) పద్ధతిలో జరిగే పరీక్షకు రెండు పేపర్లు ఉంటాయి.
- పేపర్-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు.
- ఆబ్జెక్టివ్ తరహాలో 50 ప్రశ్నలకు పేపర్–1 ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కులు కేటాయిస్తారు. ఇందులో అభ్యర్థుల బోధన/పరిశోధన ఆప్టిట్యూడ్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలుంటాయి. అలాగే తార్కిక సామర్థ్యం, గ్రహణశక్తి, భిన్నమైన ఆలోచనల దృక్పథాన్ని పరిశీలించే విధంగా ప్రశ్నలు అడుగుతారు.
- ఈ పేపర్‌లో అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్టు నుంచి ఆబ్జెక్టివ్ తరహాలో ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కుల చొప్పున 100 ప్రశ్నలను అడుగుతారు.
- ఓసీలకు రూ.2000; బీసీ/ ఈడబ్ల్యూఎస్‌లకు రూ.1500; ఎస్సీ, ఎస్టీ, వీహెచ్, హెచ్‌ఐ, ఓహెచ్, ట్రాన్స్‌జెండర్‌లకు రూ.1000గా దరఖాస్తు రుసుం నిర్ణయించారు.
- నవంబర్ 1 నుంచి 8వరకు రూ.1,500 ఫైన్ తో అప్లయ్ చేసుకోవచ్చు. నవంబర్ 9 నుంచి 19 వరకు రూ.2వేల అపరాధ రుసుముతో ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. ఇక రూ.3వేల అపరాధ రుసుముతో నవంబర్ 21, 22 తేదీల్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు.
- ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ,నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో పరీక్ష కేంద్రాలుంటాయి.
- హాల్ టికెట్లు డిసెంబర్ 3వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయి.
- డిసెంబర్ 2వ వారం నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి.
- అప్లికేషన్ డైరెక్ట్ లింక్ - https://tgset.aptonline.in/TGSET/ApplicationForm.aspx
{{^htLoading}} {{/htLoading}}
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}