TG SET 2026 Answer Keys : 'తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష' (TG-SET-2026) ప్రాథమిక కీలను ఉస్మానియా విశ్వవిద్యాలయం విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో గత సెప్టెంబర్ 28, 29 మరియు 30 తేదీల్లో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన రెస్పాన్స్ షీట్లు, ప్రశ్నాపత్రాలు మరియు ప్రాథమిక కీలను అధికారిక వెబ్‌సైట్లలో పొందుపరిచారు.
అక్టోబర్ 12 నుంచి అభ్యంతరాల స్వీకరణ…

పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ రెస్పాన్స్ షీట్లను www.telanganaset.org వెబ్‌సైట్ల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ప్రాథమిక కీలలో ప్రచురించిన సమాధానాలపై ఏవైనా సందేహాలు లేదా అభ్యంతరాలు ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించారు.
అక్టోబర్ 12, 2026 మధ్యాహ్నం 3:00 గంటల నుంచి అభ్యంతరాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లొచ్చు. ఇందుకు అక్టోబర్ 15, 2026 రాత్రి 11:00 గంటల వరకు అవకాశం ఉంటుంది. ప్రాసెస్ రుసుము చెల్లించడానికి అక్టోబర్ 15వ తేదీ రాత్రి 11:00 గంటల వరకు ఆఖరి గడువుగా నిర్ణయించారు.
ప్రతి ప్రశ్నకు రూ. 200 (రెండు వందల రూపాయలు) నాన్-రీఫండబుల్ ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే ఈ ఫీజు చెల్లించాలి. ప్రాసెసింగ్ రుసుము అందని అభ్యంతరాలను, అలాగే ఇతర మార్గాల్లో (పోస్ట్ లేదా ఈమెయిల్) పంపే విజ్ఞప్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణించబోమని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థి లేవనెత్తిన అభ్యంతరం సరైనదని సబ్జెక్ట్ నిపుణుల కమిటీ నిర్ధారిస్తే, వారు చెల్లించిన రూ. 200 రుసుమును తిరిగి రీఫండ్ చేస్తారు.
అభ్యర్థులు సమర్పించిన ఆక్షేపణలను సంబంధిత సబ్జెక్టు నిపుణుల బృందం సమగ్రంగా పరిశీలిస్తుంది. నిపుణులు సవరించిన తుది సమాధానాల ఆధారంగా ఫలితాలను సిద్ధం చేసి ప్రకటిస్తారు. అభ్యంతరాల అంగీకారం లేదా తిరస్కరణపై అభ్యర్థులకు వ్యక్తిగతంగా ఎలాంటి సమాచారం ఇవ్వరు. నిపుణులు ఖరారు చేసిన ఫైనల్ కీయే ఆఖరిదిగా ఉంటుంది. ముఖ్యమైన అప్డేట్స్ కోసం https://telanganaset.org/ వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.
{{/usCountry}}అభ్యర్థులు సమర్పించిన ఆక్షేపణలను సంబంధిత సబ్జెక్టు నిపుణుల బృందం సమగ్రంగా పరిశీలిస్తుంది. నిపుణులు సవరించిన తుది సమాధానాల ఆధారంగా ఫలితాలను సిద్ధం చేసి ప్రకటిస్తారు. అభ్యంతరాల అంగీకారం లేదా తిరస్కరణపై అభ్యర్థులకు వ్యక్తిగతంగా ఎలాంటి సమాచారం ఇవ్వరు. నిపుణులు ఖరారు చేసిన ఫైనల్ కీయే ఆఖరిదిగా ఉంటుంది. ముఖ్యమైన అప్డేట్స్ కోసం https://telanganaset.org/ వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.
{{/usCountry}}ఈ టీజీ సెట్ -2026ను రెండు పేపర్లలో నిర్వహించారు. పేపర్-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులంటాయి. వీటిలో అభ్యర్థులు సాధించే మెరిట్ మార్కుల ఆధారంగా ఫలితాలను ప్రకటిస్తారు. ఓపెన్ కేటగిరితో పాటు రిజర్వేషన్ల ఆధారంగా కటాఫ్ స్కోర్ ను నిర్ణయించి.. అర్హత సాధించిన వారికి మాత్రమే సెట్ పత్రాలను అందజేస్తారు.