TG TET Results 2026 : తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల - ఈ డైరెక్ట్ లింక్ తో మీ స్కోర్ చెక్ చేసుకోండి
Telangana TET Results 2026 : తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET) జూన్ సెషన్ ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్ సాయంతో అధికారిక వెబ్‌సైట్ ద్వారా స్కోర్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET) జూన్ సెషన్ ఫలితాలు వచ్చేశాయ్. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ మార్కులు, స్కోర్ కార్డ్‌ను వెబ్‌సైట్ ద్వారా వేగంగా తెలుసుకోవచ్చు. ఈ ఏడాది టెట్ పరీక్షల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 43.94 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. జూన్ 16 నుంచి జూన్ 22 వరకు మొత్తం పది సెషన్లలో కంప్యూటర్ ఆధారిత పరీక్షగా (CBT) ఈ పరీక్షలను ప్రభుత్వం నిర్వహించింది.

ఈ ఏడాది జూన్ సెషన్ టెట్ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,53,752 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,15,028 మంది (74.81 శాతం) పరీక్షకు హాజరయ్యారు. కాగా, ఈ పరీక్ష రాసిన వారిలో 23,623 మంది ఇన్-సర్వీస్ (ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న) ఉపాధ్యాయులు ఉన్నారు. అయితే…. సాధారణ అభ్యర్థులతో పోలిస్తే వీరి ఉత్తీర్ణత శాతం భారీగా తగ్గింది. ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులలో కేవలం 37.29 శాతం మంది మాత్రమే ఈ పరీక్షలో అర్హత సాధించారు.
టీజీ టెట్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి..:
అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా సులభంగా ఫలితాలను చూసుకునేందుకు విద్యాశాఖ ప్రత్యేకంగా పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది.
- మొదటగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://tgtet.aptonline.in సందర్శించాలి.
- హోం పేజీలో కనిపించే 'TG TET June 2026 Results' అనే లింక్‌పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత ఓపెన్ అయ్యే లాగిన్ పేజీలో మీ హాల్ టికెట్ నంబర్, పేపర్ వివరాలను నమోదు చేయాలి.
- సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయగానే మీ టెట్ స్కోర్‌కార్డ్(మార్కుల మెమో) స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- భవిష్యత్తు అవసరాల కోసం అభ్యర్థులు తమ రిజల్ట్ కాపీని డౌన్‌లోడ్ చేసుకుని, ఒక ప్రింట్ అవుట్ దగ్గర ఉంచుకోవడం మంచిది.
ఈ డైరెక్ట్ లింక్ పై క్లిక్ చేసి టీజీ టెట్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

