...
...
Next Story

తెలంగాణ గ్రూప్ 3 అభ్యర్థులకు అప్డేట్ - సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ రిలీజ్, మీ వద్ద ఉండాల్సిన పత్రాలివే

గ్రూప్ 3 అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక అప్డేట్ ఇచ్చింది. నవంబర్ 10వ తేదీ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను చేపటనుంది. ఈ నెల 26 వరకు పరిశీలన ఉంటుందని వెల్లడించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

Published on: Nov 9, 2025, 07:55:12 IST
Advertisement

తెలంగాణ గ్రూప్ 3 అభ్యర్థులకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక అప్డేట్ ఇచ్చింది. ఇప్పటికే ఫలితాలను(జనరల్ ర్యాంకింగ్ ) ప్రకటించగా… తాజాగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలను ప్రకటించింది. నవంబర్ 10వ తేదీ నుంచి ఈనెల 26 వరకు పరిశిలీన ఉంటుందని పేర్కొంది.

గ్రూప్‌-3 ధ్రువపత్రాల పరిశీలన
గ్రూప్‌-3 ధ్రువపత్రాల పరిశీలన

ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 05.30 గంటల వరకు నాంపల్లి పబ్లిక్‌గార్డెన్‌లోని సురవరం ప్రతాప్‌రెడ్డి యూనివర్సిటీలో(గతంలో పొట్టి శ్రీరాములు యూనివర్శిటీ) ధ్రువీకరణ పత్రాల పరిశీలన జరుగుతుందని టీజీపీఎస్సీ ప్రకటించింది. ఈ మేరకు శనివారం వివరాలను వెల్లడించింది. ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను https://www.tgpsc.gov.in లో అందుబాటులో ఉంచారు. హాల్ టికెట్ నెంబర్లను పేర్కొన్నారు.

టీజీపీఎస్సీ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… అభ్యర్థులు వెరిఫికేషన్ కు హాజరుకావాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఒరిజినల్‌ ధ్రువీకరణ పత్రాలతో పాటు రెండు సెట్లు స్వయంగా సంతకం చేసిన ఫొటో కాపీలు తీసుకురావాల్సి ఉంటుంది.

అభ్యర్థి ఉండాల్సిన పత్రాలు...

  • అప్లికేషన్ ఫామ్
  • హాల్ టికెట్ పత్రం
  • ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డు లేదా పాస్ పోర్ట్/ డ్రైవింగ్ లైసెన్స్/ సర్వీస్ ఐడీ కార్డ్స్, పాన్ కార్డు
  • విద్యా అర్హత పత్రాలు
  • పదో తరగతి మెమో
  • ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు
  • రెసిడెన్సీ సర్టిఫికెట్లు
  • స్పోర్ట్స్ రిజర్వేషన్ ఉంటే ధ్రువీకరణ పత్రాలు
  • కుల ధ్రువీకరణ పత్రం
  • ఈడబ్యూఎస్ అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్ సమర్పించాలి.
  • దివ్యాంగ అభ్యర్థులు - సంబంధిత సర్టిఫికెట్లు
  • ఇతర ధ్రువపత్రాలు

రాష్ట్రంలో 1365 గ్రూప్‌ 3 పోస్టుల భర్తీకి గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షలకు 50.24శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీటికి సంబంధించిన ప్రాథమిక కీలను విడుదల చేసి అభ్యంతరాలను కూడా స్వీకరించారు. ఈ ప్రక్రియంతా పూర్తి కావటంతో… ఈ ఏడాదిలో మార్చిలో ఫలితాలను(జనరల్ ర్యాంకింగ్ లిస్ట్) ప్రకటించారు. అంతేకాకుండా ఫైనల్ కీలతో పాటు మాస్టర్ క్వశ్చన్ పేపర్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe